SNP
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా.. మూడో టీ20 కోసం సిద్ధమైంది. మరి ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపుమీదున్న ఇండియా.. ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో దిగబోతుందో చూద్దాం..,
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా.. మూడో టీ20 కోసం సిద్ధమైంది. మరి ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపుమీదున్న ఇండియా.. ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో దిగబోతుందో చూద్దాం..,
SNP
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమి పాలైనా.. వెంటనే మొదలైన టీ20 సిరీస్‌లో టీమిండియా అదరగొడుతోంది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతున్న యంగ్ టీమిండియా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి.. సిరీస్ విజయంపై కన్నేసింది. గౌహఠి వేదికగా భారత్-ఆసీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి బర్సపరా క్రికెట్ స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి.. సిరీస్ వశం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ను సజీవంగా ఉంచాలని కంగారుల జట్టు పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
రెండు జట్లు కూడా వన్డే వరల్డ్ కప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడంతో.. ఇరు వైపులా యంగ్ ప్లేయర్ల బరిలోకి దిగుతున్నారు. ఒక విధంగా ఆస్ట్రేలియానే పేపర్‌పై స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా.. యంగ్ టీమిండియా అద్భుతంగా ఆడుతుండటంతో ఆసీస్ తలవంచక తప్పడం లేదు. టీమిండియా బౌలింగ్ విభాగం, బ్యాటింగ్ లైనప్ సూపర్ ఫామ్‌లో ఉన్నాయి. బ్యాటింగ్‌లో.. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్ ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం అదరగొడుతోంది. ఇక బౌలింగ్‌లో స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే.. మూడో టీ20లో టీమిండియా కేవలం ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
జట్టులోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు చేయకపోయినా.. బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఒక్క మార్పు జరగొచ్చు. అర్షదీప్ సింగ్ లేదా ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ఆవేశ్ ఖాన్‌ను ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ మార్పు చేస్తారో లేక విన్నింగ్ టీమ్‌ను కొనసాగిస్తారో చూడాలి. మూడో మ్యాచ్ గెలిస్తే.. జట్టులోని ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు చాలా మార్పులు జరగొచ్చు. అలాగే శ్రేయస్ అయ్యర్ సైతం నాలుగో మ్యాచ్‌కి జట్టుతో కలవనున్నాడు. అయ్యర్ వైస్ కెప్టెన్ కావడంతో అను ప్లేయింగ్‌లో కన్నితంగా ఉంటాడు. ఇప్పుడు మూడో టీ20లో ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండొబోతుందో చూద్దాం..
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ/ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్.
Indian cricket team arrived at #Guwahati airport for the 3rd T20 match to be played against Australia in Guwahati on Nov 28.#INDvsAUS #T20IndVsAus pic.twitter.com/10kccwwUYr
— Hemanta Kumar Nath (@hemantakrnath) November 27, 2023