iDreamPost
android-app
ios-app

ఇండియా vs ఆస్ట్రేలియా.. అక్కడ బాల్ తగిలి విలవిల్లాడిన బ్యాటర్!

  • Author singhj Published - 05:19 PM, Mon - 27 November 23

భారత్-ఆసీస్ రెండో టీ20లో ఒక బ్యాటర్​కు అక్కడ బాల్ తగిలింది. తగలరాని చోట బాల్ తాకడంతో ఆ ప్లేయర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు.

భారత్-ఆసీస్ రెండో టీ20లో ఒక బ్యాటర్​కు అక్కడ బాల్ తగిలింది. తగలరాని చోట బాల్ తాకడంతో ఆ ప్లేయర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు.

  • Author singhj Published - 05:19 PM, Mon - 27 November 23
ఇండియా vs ఆస్ట్రేలియా.. అక్కడ బాల్ తగిలి విలవిల్లాడిన బ్యాటర్!

యంగ్ ఇండియా జోరు మామూలుగా లేదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్​లో భారత జట్టు అదరగొడుతోంది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఫస్ట్ టీ20లో కంగారూలకు షాకిచ్చిన మన టీమ్.. తిరువనంతపురంలో జరిగిన రెండో మ్యాచ్​లో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 53) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీళ్లిద్దరి ధాటికి భారత్ 5 ఓవర్లు కంప్లీట్ అయ్యే సరికి 70కి పైగా పరుగులు చేసేసింది. ఆ తర్వాత మరింత వేగంగా ఆడే ప్రయత్నంలో జైస్వాల్ ఔటయ్యాడు. కానీ క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52) మంచి సపోర్ట్ అందించడంతో రుతురాజ్ ఇన్నింగ్స్​ను బిల్డ్ చేశాడు.

రుతురాజ్-ఇషాన్ కలసి రెండో వికెట్​కు 87 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఔటైనా సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 19), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్), తిలక్ వర్మ (2 బంతుల్లో 7) ఆకట్టుకోవడంతో టీమ్ 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఖర్లో రింకూ వరుస బౌండరీలు, సిక్సులతో అపోజిషన్ టీమ్​ను కంగారెత్తించాడు. బాల్ మెరిట్​ను బట్టి ఆడుతూ ఆసీస్ ముందు భారీ టార్గెట్ ఉంచాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పర్యాటక టీమ్​కు మంచి స్టార్ట్ దొరికింది. మాట్ షార్ట్ (19), స్టీవ్ స్మిత్ (19) మంచి ఊపులో కనిపించారు. షార్ట్ అయితే వరుసగా మూడు ఫోర్లు కొట్టి హెచ్చరికలు పంపాడు. కానీ గత మ్యాచ్​లోలాగే స్పిన్నర్​ రవి బిష్ణోయ్​కు చిక్కాడు.

షార్ట్​తో పాటు లాస్ట్ మ్యాచ్​ సెంచరీ హీరో జోష్ ఇంగ్లిస్ (2)ను వెంట వెంటనే ఔట్ చేశాడు బిష్ణోయ్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ ఆల్​రౌండర్ మాక్స్​వెల్ భారత బౌలర్లపై అటాక్​కు దిగాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో ఒక సిక్స్, ఒక బౌండరీ కూడా బాదాడు. అయితే అక్షర్ పటేల్ అతడికి ఏమాత్రం రూమ్ ఇవ్వకపోవడంతో పక్కకు జరిగి షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బాల్ కనెక్ట్ కాకపోవడంతో క్యాచ్ లేచింది. దీన్ని యంగ్​స్టర్ జైస్వాల్ ఒడిసి పట్టుకున్నాడు. అనంతరం మార్కస్ స్టొయినిస్ (45), టిమ్ డేవిడ్ (37) మధ్య మంచి పార్ట్​నర్​షిప్ నెలకొంది. వీళ్లిద్దరూ కలసి 81 రన్స్ జోడించడంలో ఆసీస్ శిబిరంలో ఆశలు చిగురించాయి.

ప్రమాదకరంగా మారిన స్టొయినిస్-డేవిడ్ జోడీని పేసర్ ముకేష్ కుమార్ విడగొట్టాడు. స్టొయినిస్​ను ముకేష్ వెనక్కి పంపగా.. డేంజరస్ డేవిడ్​ను బిష్ణోయ్ ఔట్ చేశాడు. ఆఖర్లో మాథ్యూ వేడ్ (23 బంతుల్లో 42) ఎంత ప్రయత్నం చేసినా అప్పటికే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. చేయాల్సిన రన్స్ ఎక్కువ ఉండటం, రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో వేడ్ ఏమీ చేయలేకపోయాడు. కానీ 4 భారీ సిక్సులు కొట్టి కాసేపు అలరించాడు. అయితే అతడు బ్యాటింగ్ చేస్తున్న టైమ్​లో ప్రసిద్ధ్ కృష్ణ ఓ బాల్ వేశాడు. అది కాస్తా వేడ్​కు తగలరాని చోట తగిలింది. దీంతో ఆసీస్ బ్యాటర్ నొప్పితో విలవిల్లాడాడు.

ప్రసిద్ధ్​ వేసిన 18వ ఓవర్​ మూడో బాల్​ను పుల్‌ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు వేడ్. అయితే మిస్సయిన ఆ బాల్ అతడికి తగలరాని చోట తగిలింది. అతడు నొప్పితో బాధపడుతుండటంతో ఫిజియో వచ్చి ట్రీట్​మెంట్ చేశారు. ఆ తర్వాత కాస్త కోలుకున్న కంగారూ కెప్టెన్ నొప్పితోనే బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. అయితే ముకేష్ కుమార్ వేసిన లాస్ట్ ఓవర్​లోనూ ఒక బాల్​ మళ్లీ వేడ్​కు అక్కడే తగిలింది. దీంతో అతడు మరోసారి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్​ రూమ్​కే పరిమితమైన వేడ్.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్​కు కూడా రాలేదు. అతడి స్థానంలో ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఇదీ చదవండి: సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేసిన రింకూ సింగ్.. అదే కారణమంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి