iDreamPost
android-app
ios-app

కోహ్లీ ఆ ఆయుధాన్ని బయటకు తీయాల్సిన టైమ్ వచ్చింది: ఇర్ఫాన్ పఠాన్

  • Published Jun 20, 2024 | 3:57 PM Updated Updated Jun 20, 2024 | 3:57 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ సూచన చేశాడు. ఆ ఆయుధాన్ని కింగ్ బయటకు తీయాలన్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ సూచన చేశాడు. ఆ ఆయుధాన్ని కింగ్ బయటకు తీయాలన్నాడు.

  • Published Jun 20, 2024 | 3:57 PMUpdated Jun 20, 2024 | 3:57 PM
కోహ్లీ ఆ ఆయుధాన్ని బయటకు తీయాల్సిన టైమ్ వచ్చింది: ఇర్ఫాన్ పఠాన్

టీ20 ప్రపంచ కప్-2024లో అసలు సిసలు పోరాటాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు గ్రూప్ దశ మ్యాచ్​లు చూస్తూ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు సూపర్-8 ఫైట్స్​ ఆస్వాదిస్తున్నారు. ఆల్రెడీ రెండు మ్యాచ్​లు జరిగాయి. ఇవాళ టీమిండియా తమ తొలి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. ఆఫ్ఘానిస్థాన్​తో తాడోపేడో తేల్చుకోనుంది రోహిత్ సేన. సెమీస్​కు అర్హత సాధించాలంటే ఇక మీదట ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. గెలిస్తే ముందు దశకు వెళ్లడం లేదంటే ఇంటికి పయనమవ్వాల్సిందే. అందుకే టీమ్స్ అన్నీ తమ బెస్ట్ ఇవ్వాలని చూస్తున్నాయి. లీగ్ స్టేజ్ మ్యాచ్​లు యూఎస్​ఏ పిచ్​లపై ఆడిన భారత్.. సూపర్ మ్యాచ్​లను కరీబియన్ గ్రౌండ్స్​లో ఆడనుంది. ఇక్కడి స్లో వికెట్లపై మన ఆటగాళ్లు ఎలా తమ గేమ్​ను అడ్జస్ట్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

టీమిండియాలో అందరికంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ గురించి ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. సాధారణంగా ఐసీసీ టోర్నమెంట్స్​లో చెలరేగి ఆడుతుంటాడు కింగ్. అలాంటోడు ఈసారి మెగా టోర్నీలో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. అలా వెళ్లి ఇలా రావడం అతడికి అలవాటుగా మారింది. ఆడిన మూడు మ్యాచుల్లో ఒక్కసారి కూడా డబుల్ ఫిగర్స్ చేరుకోలేదు. దీన్ని బట్టే అతడి ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్​తో అయినా కోహ్లీ గాడిన పడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ తరుణంలో భారత మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ తప్పక ఫామ్​లోకి వస్తాడని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లూ దాచి ఉంచిన ఆయుధాన్ని అతడు బయటకు తీయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు.

స్పిన్నర్లను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ మధ్య స్లాగ్ స్వీప్స్ ఆడటం మొదలుపెట్టాడు కోహ్లీ. ఐపీఎల్​-2024లో ఈ షాట్​తో భారీగా పరుగులు రాబట్టాడు. వరల్డ్ కప్​లోని తదుపరి మ్యాచులన్నీ వెస్టిండీస్​లో జరుగుతాయి. అక్కడి పిచ్​లు స్పిన్​కు అనుకూలిస్తాయి. అందుకే స్లాగ్ స్వీప్ ఆయుధాన్ని బయటకు తీయాలని కోహ్లీకి సూచించాడు పఠాన్. ‘విరాట్ బిగ్ మ్యాచ్ ప్లేయర్. కీలక మ్యాచుల్లో అతడు తప్పక రాణిస్తాడు. పెద్ద మ్యాచుల్లో ఒత్తిడి సమయాల్లో రాణిస్తాడు కాబట్టే కోహ్లీ ఇంత పేరు తెచ్చుకున్నాడు. అతడో ప్రత్యేక ఆటగాడు. నెక్స్ట్ మ్యాచెస్​లో అతడి బ్యాట్ నుంచి స్లాగ్ స్వీప్స్ ద్వారా భారీగా పరుగులు వస్తాయి. మీరు కోహ్లీలోని మరో యాంగిల్​ను చూస్తారు’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. విరాట్ మీద నమ్మకం ఉంచాలని, అతడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడని తెలిపాడు. స్లాగ్ స్వీప్స్​తో పాటు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కోహ్లీ అమ్ములపొదిలో ఎన్నో డిఫరెంట్ షాట్స్ ఉన్నాయని పఠాన్ పేర్కొన్నాడు. మరి.. కోహ్లీ స్లాగ్ స్వీప్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.