Nidhan
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత టీ20ల్లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు విరాట్. ఒక సూపర్ స్టార్‌తో కొన్నేళ్లుగా చాటింగ్ చేస్తున్నానని తెలిపాడు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత టీ20ల్లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు విరాట్. ఒక సూపర్ స్టార్‌తో కొన్నేళ్లుగా చాటింగ్ చేస్తున్నానని తెలిపాడు.
Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో రెండో టీ20 మ్యాచ్ ఆడేందుకు భారత క్రికెట్ టీమ్ రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. కాబట్టి దీన్ని లైట్‌గా తీసుకోవద్దని అనుకుంటోంది. తొలి టీ20 నుంచి తప్పుకున్న స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. టీమ్‌తో జాయిన్ అయిన విరాట్.. జోరుగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరగనున్న ఈ టీ20లో తన బ్యాట్ పవర్ చూపించేందుకు కింగ్ సిద్ధమవుతున్నాడు. 14 నెలల గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్న విరాట్.. టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌ను స్టార్ట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు ఇదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. అయితే రెండో టీ20కి ముందు కోహ్లీ ఓ ఆసక్తికర విషయాన్ని అందరితో పంచుకున్నాడు. ఓ సూపర్ స్టార్‌తో తాను చాన్నాళ్లుగా చాట్ చేస్తున్నానని తెలిపాడు. అసలు కోహ్లీ ఎవరితో చాట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టెన్నిస్ సూపర్‌స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో చాన్నాళ్లుగా టచ్‌లో ఉన్నానని విరాట్ కోహ్లీ తెలిపాడు. అయితే ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తాము నేరుగా కలవలేదన్నాడు. తన గురించి జొకోవిచ్ చేసిన వ్యాఖ్యలు ఎంతో గర్వకారణమని చెప్పాడు. అతడి కెరీర్, సాధించిన ఘనతలు అపూర్వమని మెచ్చుకున్నాడు. ‘నొవాక్‌తో అనుకోకుండా టచ్‌లోకి వచ్చా. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ చూస్తూ మెసేజ్ బటన్ నొక్కా. హలో అని టెక్స్ట్ చేద్దామనుకున్నా. అయితే అప్పటికే అతడి నుంచి నాకో మెసేజ్ వచ్చి ఉంది. దీంతో అది ఫేక్ అకౌంట్ అనుకొని చెక్ చేశా. అది అఫీషియల్ అకౌంట్ అని తెలిశాక మేం ఇద్దరమూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం. మేం తరచూ మెసేజ్‌లు చేసుకుంటాం. ఒకరికొకరు కంగ్రాట్స్ చెప్పుకుంటాం. నేను 50 సెంచరీల రికార్డు సృష్టించినప్పుడు జొకోవిచ్ తన ఇన్‌స్టాలో నాపై స్టోరీ పెట్టాడు. మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి పరస్పర గౌరవం ఉంది. క్రీడా ప్రపంచంపై తమదైన ముద్ర వేస్తున్న నొవాక్ లాంటి గ్లోబల్ అథ్లెట్స్‌తో కనెక్ట్ అవడం గొప్ప విషయం’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
గ్లోబల్ అథ్లెట్ల మధ్య గుడ్ రిలేషన్స్ ఉండటం అనేది భవిష్యత్ తరాలకు మంచి సందేశాన్ని పంపుతుందన్నాడు కోహ్లీ. జొకోవిచ్ తన కెరీర్లో సాధించిన విజయాలు, అతడు పడిన కష్టం, ఫిట్నెస్ లెవల్స్ తనకు ఇష్టమని పేర్కొన్నాడు. త్వరలో తామిద్దరం కలుస్తామని తెలిపాడు. జొకోవిచ్ ఇండియాకు వచ్చినా లేదా అతడు ఆడే దేశానికి తాను వెళ్లినా తప్పక కలుస్తామని టీమిండియా స్టార్ స్పష్టం చేశాడు. అతడితో కప్పు కాఫీ తాగాలని ఉందన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కంగారూ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌తో కాసేపు క్రికెట్ ఆడాడు జొకోవిచ్. వీళ్లిద్దరూ టెన్నిస్ కూడా ఆడారు. దీని మీద కోహ్లీ రియాక్ట్ అయ్యాడు.
‘జొకోవిచ్-స్మిత్ కలసి టెన్నిస్ ఆడిన వీడియో చూశా. మేం టెన్నిస్ రాకెట్ స్వింగ్ చేసే దాని కంటే అతడు (జొకోవిచ్) క్రికెట్ బ్యాట్‌ను బెటర్‌గా స్వింగ్ చేశాడు. స్మిత్ కూడా అతడి సర్వ్‌ను భలేగా తిప్పికొట్టాడు. నాకూ జొకోవిచ్‌తో కలసి టెన్నిస్ ఆడాలని ఉంది. అయితే టెన్నిస్‌లో సర్వ్స్ ఎంత వేగంగా నాకు తెలుసు. జొకోవిచ్‌కు నేను ఒక్కటి మాత్రం నేర్పగలను. క్రికెట్ బ్యాట్‌ను ఎలా పట్టుకోవాలో చెప్పగలను. జొకోవిచ్‌కు ఆల్ ది బెస్ట్. అతడు ఆస్ట్రేలియా ఓపెన్ గెలుస్తాడని అనుకుంటున్నా’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. మరి.. జొకోవిచ్-కోహ్లీ ఫ్రెండ్షిఫ్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: బ్రేకింగ్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన IPL సూపర్ స్టార్!
𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹 𝗙𝗲𝗮𝘁𝘂𝗿𝗲
Virat Kohli 🤝 Novak Djokovic
Two 🐐 🐐, one special bond 💙
Virat Kohli shares the story about his newest “text buddy” 👌👌 – By @ameyatilak#TeamIndia | @imVkohli | @DjokerNole | @AustralianOpen
𝙋.𝙎. – “Hey Novak 👋 – Good luck at AO” pic.twitter.com/PEPQnydwJB
— BCCI (@BCCI) January 14, 2024