iDreamPost

Virat Kohli: కోహ్లీపై విమర్శలు.. గట్టిగా ఇచ్చిపడేసిన కెప్టెన్ రోహిత్!

  • Published Jan 18, 2024 | 3:58 PMUpdated Jan 19, 2024 | 11:09 AM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శల మీద కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. కింగ్​ను ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా ఇచ్చిపడేశాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శల మీద కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. కింగ్​ను ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా ఇచ్చిపడేశాడు.

  • Published Jan 18, 2024 | 3:58 PMUpdated Jan 19, 2024 | 11:09 AM
Virat Kohli: కోహ్లీపై విమర్శలు.. గట్టిగా ఇచ్చిపడేసిన కెప్టెన్ రోహిత్!

ఇండియా-ఆఫ్ఘానిస్థాన్​ ఆఖరి టీ20 మ్యాచ్ అదిరిపోయింది. నరాలు తెగే ఉత్కంఠ పోరు, ఫ్యాన్స్​ను మునివేళ్ల మీద నిల్చోబెట్టిన మ్యాచ్​లా క్రికెట్ హిస్టరీలో నిలిచింది. ఏకంగా రెండు సూపర్ ఓవర్లు జరిగిన ఈ మ్యాచ్​ను క్రికెట్ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. చివరి వరకు రెండు జట్లు భీకరంగా పోరాడినా కెప్టెన్ రోహిత్ శర్మ తెలివిగా పన్నిన వ్యూహాలతో భారత్ విజయం సాధించింది. 3-0 తేడాతో ఆఫ్ఘాన్​ను వైట్​వాష్​ చేసిన టీమిండియాకు.. ఈ సిరీస్​ చాలా విధాలుగా బిగ్ ప్లస్​గా నిలిచింది. టీ20 వరల్డ్ కప్-2024కి ముందు టీమ్ కాంబినేషన్ విషయంలో ఓ అవగాహనకు రావడానికి ఇది చాలా ఉపయోగపడింది. దాదాపు 14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్​లోకి కమ్​బ్యాక్ ఇచ్చిన రోహిత్ ఆఖరి మ్యాచ్​లో సెంచరీతో తన సత్తాను మరోమారు చాటాడు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుస మ్యాచుల్లో ఫెయిలైన కింగ్​ను కొందరు ట్రోల్ చేస్తున్నారు.

ఆఫ్ఘాన్​తో టీ20 సిరీస్​లో యంగ్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, శివమ్ దూబె, రింకూ సింగ్ సత్తా చాటారు. ముఖ్యంగా దూబె, రింకూ మ్యాచ్​లు ఫినిష్ చేసి వచ్చే టీ20 వరల్డ్ కప్​లో తమను ఆడించాల్సిందేనని ఇన్​డైరెక్ట్​గా స్టేట్​మెంట్స్ ఇచ్చారు. యువ ఆటగాళ్లు ఇలా చెలరేగిపోతే తొలి రెండు మ్యాచుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కానీ మూడో మ్యాచ్​లో 69 బంతుల్లో 121 పరుగుల సంచలన ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. సూపర్ ఓవర్​లోనూ భారీ సిక్సులు బాది మరో విక్టరీని టీమ్​కు అందించాడు. హిట్​మ్యాన్ ఇలా చిచ్చర పిడుగులా చెలరేగితే.. మరో సీనియర్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ మాత్రం చివరి టీ20లో గోల్డెన్ డక్ అయ్యాడు. మొదటి మ్యాచ్​కు దూరంగా ఉన్న కింగ్.. రెండో టీ20లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖరి మ్యాచ్​లోనైనా మెరుపులు మెరిపిస్తాడని అనుకుంటే 0 పరుగులకే పెవిలియన్​కు చేరుకున్నాడు. దీంతో చాలా మంది విమర్శకులు అతడ్ని టార్గెట్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారు.

Trolls on Kohli

కోహ్లీపై వస్తున్న విమర్శలకు కెప్టెన్ రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. విరాట్ ఫస్ట్ బాల్ నుంచే దూకుడుగా ఆడాలని ఫిక్స్ అయ్యాడని అన్నాడు. అయితే ఇలా ఆడే క్రమంలో అతడు తన వికెట్ పోగొట్టుకున్నాడని తెలిపాడు. ‘ఈ మ్యాచ్​లో మూడు సార్లు బ్యాటింగ్​ చేయాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకముందు ఇలా ఎప్పుడు ఆడానో గుర్తులేదు. ఐపీఎల్​లో ఒకసారి ఇలాగే ఆడాననుకుంటా. రింకూ సింగ్​తో కలసి 190 రన్స్ జోడించడం చాలా స్పెషల్. కోహ్లీ తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ నుంచి మంచి ఇంటెంట్ చూపించాడు. ఈ క్రమంలోనే అతడు ఔట్ అయ్యాడు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. రింకూ అద్భుతంగా ఆడుతున్నాడని మెచ్చుకున్న హిట్​మ్యాన్.. తన బలాలు ఏంటో అతడికి బాగా తెలుసునని పేర్కొన్నాడు. టీమిండియాకు ఇలాంటి ప్లేయర్ల అవసరం చాలా ఉందన్నాడు. మరి.. కోహ్లీని ట్రోల్ చేస్తున్న వారికి రోహిత్ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: వీడియో: అంపైర్​తో రోహిత్ ఫన్నీ చాట్.. రెండుసార్లు డకౌట్ అయ్యానంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి