Nidhan
సూపర్-8కు సిద్ధమవుతోంది టీమిండియా. గ్రూప్ దశలో మాదిరిగానే ఎదురొచ్చిన ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని భావిస్తోంది.
సూపర్-8కు సిద్ధమవుతోంది టీమిండియా. గ్రూప్ దశలో మాదిరిగానే ఎదురొచ్చిన ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని భావిస్తోంది.
Nidhan
సూపర్-8కు సిద్ధమవుతోంది టీమిండియా. గ్రూప్ దశలో మాదిరిగానే ఎదురొచ్చిన ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్‌తో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని భావిస్తోంది. సూపర్ పోరులో భాగంగా తొలి మ్యాచ్‌లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్‌ను ఫేస్ చేయనుంది మెన్ ఇన్ బ్లూ. తర్వాతి మ్యాచుల్లో ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాతో పాటు బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ మూడు జట్లు కూడా కరీబియన్ పిచ్‌లపై గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడి మంచి అనుభవం సంపాదించాయి. అక్కడి స్లో వికెట్లపై ఎలా ఆడాలనే కిటుకును గ్రహించాయి. ఎలా బ్యాటింగ్ చేయాలి, ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలనేది అర్థం చేసుకున్నాయి. అదే యూఎస్ఏ నుంచి వచ్చిన భారత్.. ఇక్కడి పిచ్‌లకు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తోంది.
విండీస్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై టీమిండియా అతిగా ఆధారపడుతోంది. వీళ్లిద్దరి మ్యాజిక్‌తో సూపర్-8 గండాన్ని అధిగమించాలని చూస్తోంది. అయితే న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియాకు అసలైన ఆయుధం కుల్దీప్ యాదవ్ అని అన్నాడు. సూపర్-8, సెమీస్ లాంటి హై టెన్షన్ మ్యాచుల్లో జట్టును అతడే గట్టెక్కిస్తాడని చెప్పాడు. కుల్దీప్ను నమ్ముకుంటే భారత్‌కు తిరుగుండదని తెలిపాడు. కరీబియన్ పిచ్‌ల నుంచి స్పిన్‌కు ఏమాత్రం సపోర్ట్ దొరికినా కుల్దీప్ చెలరేగుతాడన్నాడు. మిడిల్ ఓవర్లు అనే కాదు.. టీమ్‌కు అవసరమైన ప్రతిసారి కుల్దీప్ను ఉపయోగించి సక్సెస్ అవ్వొచ్చని సూచించాడు. ఎంతటి బ్యాటర్‌నైనా కంగుతినిపించే సత్తా అతడికి ఉందన్నాడు ఫ్లెమింగ్.
మెగా టోర్నీ ముగింపు దశకు చేరే కొద్దీ విండీస్ వికెట్లు మరింత స్పిన్ ఫ్రెండ్లీగా మారతాయని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. కాబట్టి పిచ్ నుంచి దక్కే మద్దతును స్పిన్నర్లు వాడుకోవాలని సజెషన్ ఇచ్చాడు. టీమిండియా చాలా పటిష్టంగా ఉందన్నాడు. జట్టులో గట్టి పోటీ ఉండటంతో యశస్వి జైస్వాల్ లాంటోడ్ని కూడా పక్కనబెట్టారని తెలిపాడు. భారత స్క్వాడ్‌లో నలుగురు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారని.. వెస్టిండీస్ కండీషన్స్‌ను దృష్టిలో పెట్టుకునే ఇలా సెలెక్ట్ చేశారన్నాడు. ఇది అద్భతమైన వ్యూహమని మెచ్చుకున్నాడు. వికెట్ల నుంచి స్పిన్నర్లకు ఊహించిన రేంజ్లో మద్దతు లభిస్తే రోహిత్ సేనను ఆపడం ఎవరి వల్లా కాదని ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. భారత సెలెక్టర్లు తెలివిగా ఆలోచించి స్పిన్నర్లకు టీమ్‌లో చోటు ఇచ్చారని.. ఇక వాళ్లు తమను తాము నిరూపించుకోవాలన్నాడు. మరి.. ఫ్లెమింగ్ చెప్పినట్లు కుల్దీప్ భారత్‌కు కీలకం అవుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Stephen Fleming ” I think kuldeep yadav will come in to provide that extra bit of wicket-taking flair if the wickets do provide the turn as they get a little bit more used and you get closer to the end of the tournament.”pic.twitter.com/hzH0ZnGaZn
— Sujeet Suman (@sujeetsuman1991) June 19, 2024