Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఎందులో లైవ్ స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆఫ్ఘానిస్థాన్‌తో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఎందులో లైవ్ స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
సౌతాఫ్రికా టూర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముగించిన భారత్.. సొంతగడ్డ మీద మరో సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. సఫారీ టూర్లో ఊహించిన దాని కంటే అద్భుతంగా ఆడటంతో ఫుల్ జోష్‌లో ఉంది. దాదాపు నెల రోజుల పాటు సాగిన సౌతాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకొని స్వదేశానికి తిరిగొచ్చింది. ఓటమనేదే లేకుండా టూర్‌ను షినిష్ చేయడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు భారత క్రికెటర్లు. తదుపరి ఆడే సిరీస్‌ల్లోనూ ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ విజయాలు సాధించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం రెడీ అవుతున్నారు మన ప్లేయర్లు. ఈ సిరీస్ జనవరి 11వ తేదీన మొదలుకానుంది. జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్-2024కు ముందు రోహిత్ సేన ఆడనున్న ఆఖరి పొట్టి ఫార్మాట్ సిరీస్ ఇదే కానుంది. ఈ నేపథ్యంలో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సిరీస్ మ్యాచుల్ని ఎందులో చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్-ఆఫ్ఘాన్ టీ20 సిరీస్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ వయాకామ్ సంస్థకు చెందిన స్పోర్ట్స్ 18 ఛానెల్‌కు ఉన్నాయి. ఈ సిరీస్ మ్యాచుల్ని స్పోర్ట్స్ 18 ఛానెల్లో చూడొచ్చు. మొబైల్లో లైవ్ టెలికాస్ట్ చేయాలంటే జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా చూడొచ్చు. అగ్రరాజ్యం అమెరికా వేదికగా ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచ కప్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో భారత్‌కు ఆఫ్ఘాన్ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ప్లేయర్లు నేరుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడతారు. అనంతరం వరల్డ్ కప్ బరిలో దిగుతారు. కాబట్టి టీమ్ కాంబినేషన్‌ను సెట్ చేసుకోవాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా భారత్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్. ఏయే ఆటగాళ్లను ఎక్కడెక్కడ ఆడించాలి? ఫైనల్ ఎలెవన్‌లో ఎవరు ఉండాలనే దాని మీద అవగాహనకు వచ్చేయాలి. కాబట్టి ఆఫ్ఘాన్ సిరీస్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత మళ్లీ టీ20ల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చారు. 14 నెలల పాటు పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న ఈ ఇద్దరు స్టార్లు.. మొత్తానికి ఆఫ్ఘాన్‌తో జరిగే టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. టీ20 వరల్డ్ కప్-2024 ప్రణాళికల్లో రోహిత్-కోహ్లీ ఉన్నారని సెలక్షన్ ద్వారా బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే వన్డేలు, టెస్టుల్లో అదరగొడుతున్న కేఎల్ రాహుల్, టీ20ల్లో కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేస్తున్న ఇషాన్ కిషన్‌ను సిరీస్‌కు దూరం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక, టీమిండియా-ఆఫ్ఘానిస్థాన్ టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచులు రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానున్నాయి. జనవరి 11వ తేదీన మొహాలీ వేదికగా ఫస్ట్ టీ20 జరగనుండగా.. 14న ఇండోర్‌లో రెండో టీ20, 17న బెంగళూరులో ఆఖరి టీ20 జరగనుంది. మరి.. భారత్-ఆఫ్ఘాన్ సిరీస్ చూసేందుకు మీరెంత ఆసక్తిగా ఉన్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పట్టరాని సంతోషంలో మహ్మద్ షమి.. తన కల నెరవేరిందంటూ..!
Jio Cinema’s poster for India vs Afghanistan T20I series.
– Captain Rohit Sharma & Co are ready…!!!! 🇮🇳 pic.twitter.com/gSswajozEC
— CricketMAN2 (@ImTanujSingh) January 8, 2024