iDreamPost
android-app
ios-app

Sanju Samson: రాకరాక అవకాశం వస్తే నేలపాలు చేశాడు.. సంజూ తప్పు నీదే!

  • Published Jan 17, 2024 | 8:56 PM Updated Updated Jan 17, 2024 | 8:56 PM

టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్​ టాలెంగ్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అయితే బాగా ఆడే సత్తా ఉన్నా అతడ్ని కావాలనే భారత జట్టులోకి తీసుకోవట్లేదనే విమర్శలు వస్తుంటాయి. కానీ సంజూ తన ఆటతీరుతో దీనికి న్యాయం చేయలేకపోతున్నాడు.

టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్​ టాలెంగ్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అయితే బాగా ఆడే సత్తా ఉన్నా అతడ్ని కావాలనే భారత జట్టులోకి తీసుకోవట్లేదనే విమర్శలు వస్తుంటాయి. కానీ సంజూ తన ఆటతీరుతో దీనికి న్యాయం చేయలేకపోతున్నాడు.

  • Published Jan 17, 2024 | 8:56 PMUpdated Jan 17, 2024 | 8:56 PM
Sanju Samson: రాకరాక అవకాశం వస్తే నేలపాలు చేశాడు.. సంజూ తప్పు నీదే!

ఆఫ్ఘానిస్థాన్​తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కష్టాల్లో పడింది. చెన్నైలోని ఎం. చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న ఈ పిచ్ మీద టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. వీళ్లిద్దర్నీ ఫరీద్ అహ్మద్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబె (1) ఫామ్​ను కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (0) కూడా గోల్డెన్ డక్​ అయ్యాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ (51 నాటౌట్), నయా ఫినిషర్ రింకూ సింగ్ (34 నాటౌట్) ఆదుకున్నారు. ప్రస్తుతం భారత జట్టు 13.4 ఓవర్లలో 102/4 స్కోరుతో ఉంది. అయితే ఈ మ్యాచ్​లో మిగిలిన అందరు బ్యాటర్ల కంటే శాంసన్ ఆడిన తీరు విమర్శలకు దారితీస్తోంది.

ఎంత బాగా ఆడినా సంజూ శాంసన్​కు అవకాశాలు ఇవ్వడం లేదని పలువురు సీనియర్ క్రికెటర్లతో పాటు అతడి అభిమానులు కూడా కామెంట్స్ చేయడం వినే ఉంటారు. అయితే సంజూ మాత్రం తనకు దక్కిన గోల్డెన్ ఛాన్స్​ను మరోమారు మిస్ చేసుకున్నాడు. రాకరాక టీ20ల్లో వచ్చిన అవకాశాన్ని నేలపాలు చేశాడు. ఆఫ్ఘానిస్థాన్​తో మూడో టీ20లో బరిలోకి దిగిన సంజూ కేవలం ఒకే ఒక బాల్ ఆడి పెవిలియన్​కు చేరుకున్నాడు. దీంతో అతడిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అవకాశాలు రాకపోతే రాలేదంటారు.. ఇస్తే ఆడటం చేతగాదంటూ సంజూను నెట్టింట కొందరు ట్రోల్ చేస్తున్నారు. తప్పు సెలక్టర్దది కాదు సంజూదే.. అతడు మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్​ ఉన్న నేపథ్యంలో ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో సంజూ రాణించాల్సింది. మూడు వికెట్లు పడిన టైమ్​లో క్రీజులోకి వచ్చిన సంజూ.. కెప్టెన్ రోహిత్​తో కలసి టీమ్​కు భారీ స్కోరును అందించి ఉండాల్సింది. అప్పుడు ఇటు హిట్​మ్యాన్​తో పాటు అటు సెలక్టర్లు కూడా అతడ్ని మరింత నమ్మేవారు. ఎలాగూ ఐపీఎల్ వస్తోంది.. అక్కడ బాగా పెర్ఫార్మ్ చేస్తే ఈజీగా వరల్డ్ కప్ బెర్త్​ ఖాయం చేసుకునేవాడు. కానీ ఒక్క రన్ చేయకుండానే పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపర్చాడు. ఇక, గత రెండు టీ20ల్లో అదరగొట్టిన జైస్వాల్, దూబె కూడా మూడో టీ20లో నిరాశపర్చడం గమనార్హం. వాళ్లిద్దరూ రెండంకెల స్కోరుకు చేరుకోకుండానే ఔటయ్యారు. కోహ్లీ కూడా 0 పరుగులకే క్రీజును వీడటంతో ఇన్నింగ్స్​ను బిల్డ్ చేసే బాధ్యతను రోహిత్ తీసుకున్నాడు. మరి.. సంజూ ఫెయిల్యూర్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: KL Rahul: ఇంగ్లండ్ సిరీస్​కు ముందు రాహుల్ పూజలు.. ఈసారి ఏం మొక్కుకున్నాడంటే..!