Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో బుధవారం రాత్రి బెంగళూరులో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 10 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ సెర్మనీ టైమ్‌లో ఆల్‌రౌండర్ శివమ్ దూబె ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది.
ఆఫ్ఘానిస్థాన్‌తో బుధవారం రాత్రి బెంగళూరులో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 10 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ సెర్మనీ టైమ్‌లో ఆల్‌రౌండర్ శివమ్ దూబె ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 ప్రిపరేషన్స్‌లో ఉన్న టీమిండియాకు ఆఫ్ఘానిస్థాన్‌తో సిరీస్ బాగా పనికొచ్చింది. మెగా టోర్నీకి ముందు పొట్టి ఫార్మాట్లో జరగనున్న ఆఖరి సిరీస్ కావడంతో భారత్ భయపడకుండా ప్రయోగాలు చేసింది. ఈ సిరీస్‌లో చాలా మంది యంగ్‌స్టర్స్‌కు అవకాశాలు ఇచ్చింది. అయితే అందులో యశస్వి జైస్వాల్, శివమ్ దూబె, రింకూ సింగ్ వంటి కొందరు మాత్రమే రాణించారు. ముఖ్యంగా దూబె ఆటతీరు గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తొలి రెండు టీ20ల్లో అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడీ లెఫ్టాండర్. బౌలింగ్‌లోనూ రాణించి కీలక సమయాల్లో టీమ్‌కు కావాల్సిన బ్రేక్ త్రూలు అందించాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. అయితే ఈ పురస్కారాన్ని అందుకోవడానికి దూబె వెళ్లిన టైమ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దూబేకు అవార్డు ఇవ్వగా ఇది తనకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించాడతను.
ఈ సిరీస్‌లో ఫెంటాస్టిక్ బ్యాటింగ్‌తో పాటు బాల్‌తోనూ ఆకట్టుకోవడంతో శివమ్ దూబె ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (పీవోటీఎస్) అవార్డును దక్కించుకున్నాడు. చివరి టీ20లో సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (పీవోటీఎం)గా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పురస్కారాల ప్రదానోత్సవం సమయంలో దూబేను వేదిక దగ్గరకు పిలవడంతో అతడు వెళ్లాడు. అయితే కామెంటేటర్ మురళీ కార్తీక్ రోహిత్‌కు బదులు దూబేను పీవోటీఎం అవార్డు తీసుకోవాలని కోరాడు. దీంతో అక్కడికి వచ్చిన దూబె తనకు పీవోటీఎం అవార్డు ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. దీంతో తప్పు తెలుసుకున్న కార్తీక్ సారీ చెప్పాడు. పీవోటీఎస్ అవార్డును స్వీకరించాలన్నాడు. దీంతో నవ్విన దూబె ఆ పురస్కారాన్ని తీసుకొని అక్కడి నుంచి టీమ్ దగ్గరకు వెళ్లిపోయాడు.
శివమ్ దూబె-మురళీ కార్తీక్ మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు దూబె ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ సూపర్బ్ అని అంటున్నారు. అతడు అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాడని చెబుతున్నారు. ఇక, దూబె రాణించడంతో ఓ టీమిండియా స్టార్‌కు ఇక కష్టమేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. దూబె వల్ల స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్లేస్‌కు ముప్పు పొంచి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా దూబె ఇదే రీతిలో అదరగొడితే టీ20 వరల్డ్ కప్-2024 తుది జట్టులో అతడ్నే రోహిత్ తీసుకోవడం ఖాయమని అంటున్నారు. బిగ్ సిక్సెస్ ఈజీగా కొట్టగలగడం, మ్యాచులు ఫినిష్ చేయడం, ఎఫెక్టివ్‌గా రెండు ఓవర్లు వేసే సత్తా ఉన్న దూబేను తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరి.. రోహిత్‌కు బదులు దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Rohit-Virat: రోహిత్, కోహ్లీలనే డకౌట్ చేశారు! ఇతన్ని ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోయారు
A bit of chaos at the presentation last night:
Murali Kartik – Shivam, please collect your POTM award.
Shivam Dube – how did I win the POTM award?
Murali Kartik – Sorry, I mean collect your POTS award. pic.twitter.com/x0ZlnRPNFd
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2024