Rohit-Virat: రోహిత్‌, కోహ్లీలనే డకౌట్‌ చేశారు! ఇతన్ని ఒక్కసారి కూడా ఔట్‌ చేయలేకపోయారు

ఆఫ్ఘాన్ సిరీస్​లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండుసార్లు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒకసారి డకౌట్ అయ్యారు. కానీ ఒక బ్యాటర్​ను మాత్రం ప్రత్యర్థి బౌలర్లు ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోయారు.

ఆఫ్ఘాన్ సిరీస్​లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండుసార్లు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒకసారి డకౌట్ అయ్యారు. కానీ ఒక బ్యాటర్​ను మాత్రం ప్రత్యర్థి బౌలర్లు ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోయారు.

ఆప్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​ను సొంతం చేసుకోవడంతో టీమిండియా ఫుల్ హ్యాపీగా ఉంది. టీ20 వరల్డ్ కప్​కు ముందు ఆడిన ఆఖరి పొట్టి ఫార్మాట్ సిరీస్ కావడంతో దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుందామని భావించింది. అందుకు తగ్గట్లే పలు ప్రయోగాలు చేయడమే గాక సక్సెస్ కూడా అయింది. శివమ్ దూబె రూపంలో ప్రత్యామ్నాయ ఆల్​రౌండర్ ఈ సిరీస్​తో వెలుగులోకి వచ్చాడు. ఇప్పటికే పలు మ్యాచులు ఆడినప్పటికీ ఈ సిరీస్​లో బ్యాటింగ్​తో పాటు మీడియం పేస్ బౌలింగ్​తో పలు వికెట్లు తీశాడు దూబె. తద్వారా టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్​లోకి తననూ తీసుకోవాలని చెప్పకనే చెప్పాడు. ఈ సిరీస్​లో భారత్​కు మరో బిగ్ ప్లస్ అంటే రింకూ సింగ్ బ్యాటింగ్ అనే చెప్పాలి. ఆస్ట్రేలియా టీ20 సిరీస్​తో సాటు సౌతాఫ్రికా టూర్​లోనూ అదరగొట్టిన రింకూ.. అదే ఫామ్​ను ఆఫ్ఘాన్​తో సిరీస్​లోనూ కంటిన్యూ చేశాడు. మూడు టీ20ల్లో ఒక్కసారి కూడా అతడ్ని ప్రత్యర్థి బౌలర్లు ఔట్ చేయలేకపోయారు.

ఆఫ్ఘాన్​తో సిరీస్​లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు సార్లు గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ రెండు సార్లు ఔటవగా.. అందులో ఓ గోల్డెన్ డక్ ఉంది. బ్యాట్​తో అదరగొట్టిన శివమ్ దూబె, యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇలా అందరూ ఔటయ్యారు. కానీ రింకూను మాత్రం పెవిలియన్​కు పంపలేకపోయారు ఆఫ్ఘాన్ బౌలర్లు. రోహిత్, కోహ్లీ లాంటి తోపు బ్యాటర్లను ఔట్ చేశారు గానీ రింకూ దగ్గర వారి పప్పులు ఉడకలేదు. ఈ సిరీస్​లో మొదటి మ్యాచ్​లో 16 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు రింకూ. రెండో మ్యాచ్​లో 9 రన్స్ చేసి నాటౌట్​గా ఉన్నాడు. ఆఖరి టీ20లోనూ 69 రన్స్ చేసి నాటౌట్​గా సిరీస్​ను ముగించాడు. దీన్ని బట్టి అతడి కన్​సిస్టెన్సీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీ20ల్లో గత 11 ఇన్నింగ్స్​ల్లో నాలుగు సార్లు మాత్రమే ఔటయ్యాడు రింకూ. మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ ఆఖరి వరకు క్రీజులో నాటౌట్​గా నిలబడ్డాడు.

ప్రతి సిరీస్​కు తన బ్యాటింగ్​ను మరింత మెరుగుపర్చుకుంటున్నాడు రింకూ. చివరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్​లు ఫినిష్ చేస్తున్నాడు. అవసరాన్ని బట్టి స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు హార్డ్ హిట్టింగ్​కూ దిగుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచులు ముగించాలి, ఆఖరి వరకు క్రీజులో ఉండాలనే తపన అతడిలో కనిపిస్తోంది. అలాగని రిస్క్ తీసుకోవడం లేదని కాదు.. అవసరాన్ని బట్టి ఎక్స్​ ట్రా రిస్క్ కూడా తీసుకొని భారీ షాట్స్ ఆడుతున్నాడు. భారీ షాట్ల మీదే ఆధారపడకుండా వేగంగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ అపోజిషన్ టీమ్స్​ను ఒత్తిడిలో నెడుతున్నాడు. దీంతో అతడ్ని అందరూ నయా ఫినిషర్ అంటున్నారు. రింకూ ఇదే ఫామ్​ను కంటిన్యూ చేయాలని నెటిజన్స్ కోరుతున్నారు. వచ్చే టీ20 వరల్డ్ కప్​లోనూ అతడు ఇలాగే ఆడితే భారత్​కు తిరుగుండదని చెబుతున్నారు. మరి.. రింకూను ఆఫ్ఘాన్ బౌలర్లు ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: నబి కక్కుర్తి.. సీరియస్ అయిన రోహిత్, విరాట్!

Show comments