రోహిత్​కు హర్భజన్ వార్నింగ్.. తక్కువ అంచనా వేయొద్దంటూ..!

టీమిండియా ఇప్పుడు కఠిన సవాల్​కు సిద్ధమవుతోంది. పొట్టి కప్పులో గ్రూప్ దశలో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ.. సూపర్ పోరు కోసం సన్నద్ధమవుతోంది. ఇకపై ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై కానుంది.

టీమిండియా ఇప్పుడు కఠిన సవాల్​కు సిద్ధమవుతోంది. పొట్టి కప్పులో గ్రూప్ దశలో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ.. సూపర్ పోరు కోసం సన్నద్ధమవుతోంది. ఇకపై ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై కానుంది.

పొట్టి కప్పులో వరుస విజయాలతో అదరగొట్టిన టీమిండియా సూపర్-8 స్టేజ్​కు చేరుకుంది. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాకిస్థాన్, యూఎస్​ఏను చిత్తు చేసిన రోహిత్ సేన సూపర్ పోరుకు ముందు ఫుల్ కాన్ఫిడెన్స్​తో కనిపిస్తోంది. అయితే అసలైన సవాల్ ఇప్పుడే ఎదురవనుంది. ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి డేంజరస్ టీమ్స్​తో తలపడనుంది టీమిండియా. ఈ మూడు జట్లు కూడా వెస్టిండీస్​ పిచ్​లపై లీగ్ స్టేజ్​ మ్యాచెస్ ఆడాయి. దీంతో అక్కడి వికెట్లకు అలవాటు పడ్డాయి. అదే భారత్ మాత్రం అమెరికాలో మ్యాచెస్ షినిష్ చేసుకొని వచ్చింది. దీంతో విండీస్​ స్లో వికెట్లకు తగ్గట్లు తమ ఆటతీరును ఎలా మార్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గ్రూప్ దశలో నిరాశపర్చిన మన బ్యాటింగ్ యూనిట్ మున్ముందు ఎలా పెర్ఫార్మ్ చేస్తారనే దాని మీదే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

సూపర్-8లో ఆస్ట్రేలియాతోనే అసలు పోటీ.. ఆ టీమ్​తోనే డేంజర్ అని అంతా అనుకుంటున్నారు. కంగారూలను గనుక ఓడిస్తే భారత్​కు తిరుగుండదని భావిస్తున్నారు. అయితే ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘానిస్థాన్​ సూపర్ ఫామ్​లో ఉంది. కరీబియన్ పిచ్​లను ఉపయోగించుకొని ఆ టీమ్ స్పిన్నర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నారు. ఆఫ్ఘాన్ బ్యాటర్లు ఇక్కడ భారీ స్కోర్లు బాదుతున్నారు. దీంతో అసలైన ముప్పు ఆ జట్టుతోనే అని పలువురు ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆఫ్ఘానిస్థాన్​ను తక్కువ అంచనా వేయొద్దని అన్నాడు. ఆ టీమ్​ను తేలిగ్గా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కెప్టెన్ రోహిత్ శర్మను హెచ్చరించాడు భజ్జీ.

‘ఆఫ్ఘానిస్థాన్ మంచి జట్టు. ఆ టీమ్ బాగా ఆడుతోంది. అతి తక్కువ సమయంలో ఆ టీమ్ చాలా ఎత్తుకు ఎదిగింది. ఆఫ్ఘాన్ స్క్వాడ్​లో రషీద్ ఖాన్, మహ్మద్ నబి లాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఈ టోర్నమెంట్​లో ఆ జట్టు స్పిన్ అటాకే బెస్ట్. ఆఫ్ఘానిస్థాన్​లో సూపర్బ్ స్పిన్నర్లు ఉన్నారు. వాళ్ల బ్యాటింగ్ యూనిట్ కూడా బలంగా ఉంది. వాళ్ల అడ్డగోలు షాట్లు ఆడి వికెట్లు పారేసుకునే రకం కాదు. వన్డే ప్రపంచ కప్-2023 ఆడాక ఆ టీమ్​లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆఫ్ఘాన్ బ్యాటర్లకు సిచ్యువేషన్​కు తగ్గట్లు ఎలా ఆడాలో బాగా తెలుసు. తమదైన రోజున ఎంతటి బిగ్ టీమ్​ను అయినా ఓడించే సత్తా వాళ్లకు ఉంది. కనుక లైట్ తీసుకోవద్దు. ఒకవేళ టాస్ నెగ్గి ఆరంభ ఓవర్లలో కొన్ని విషయాలు వాళ్లకు అనుకూలంగా వెళ్తే మ్యాచ్ తారుమారయ్యే ప్రమాదం ఉంది’ అని హర్భజన్ స్పష్టం చేశాడు. మరి.. ఆఫ్ఘాన్​తో జాగ్రత్త అంటూ భజ్జీ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments