Nidhan
టీమిండియా ఇప్పుడు కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. పొట్టి కప్పులో గ్రూప్ దశలో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ.. సూపర్ పోరు కోసం సన్నద్ధమవుతోంది. ఇకపై ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై కానుంది.
టీమిండియా ఇప్పుడు కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. పొట్టి కప్పులో గ్రూప్ దశలో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ.. సూపర్ పోరు కోసం సన్నద్ధమవుతోంది. ఇకపై ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై కానుంది.
Nidhan
పొట్టి కప్పులో వరుస విజయాలతో అదరగొట్టిన టీమిండియా సూపర్-8 స్టేజ్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాకిస్థాన్, యూఎస్ఏను చిత్తు చేసిన రోహిత్ సేన సూపర్ పోరుకు ముందు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తోంది. అయితే అసలైన సవాల్ ఇప్పుడే ఎదురవనుంది. ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి డేంజరస్ టీమ్స్‌తో తలపడనుంది టీమిండియా. ఈ మూడు జట్లు కూడా వెస్టిండీస్ పిచ్‌లపై లీగ్ స్టేజ్ మ్యాచెస్ ఆడాయి. దీంతో అక్కడి వికెట్లకు అలవాటు పడ్డాయి. అదే భారత్ మాత్రం అమెరికాలో మ్యాచెస్ షినిష్ చేసుకొని వచ్చింది. దీంతో విండీస్ స్లో వికెట్లకు తగ్గట్లు తమ ఆటతీరును ఎలా మార్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గ్రూప్ దశలో నిరాశపర్చిన మన బ్యాటింగ్ యూనిట్ మున్ముందు ఎలా పెర్ఫార్మ్ చేస్తారనే దాని మీదే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
సూపర్-8లో ఆస్ట్రేలియాతోనే అసలు పోటీ.. ఆ టీమ్‌తోనే డేంజర్ అని అంతా అనుకుంటున్నారు. కంగారూలను గనుక ఓడిస్తే భారత్‌కు తిరుగుండదని భావిస్తున్నారు. అయితే ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘానిస్థాన్ సూపర్ ఫామ్‌లో ఉంది. కరీబియన్ పిచ్‌లను ఉపయోగించుకొని ఆ టీమ్ స్పిన్నర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నారు. ఆఫ్ఘాన్ బ్యాటర్లు ఇక్కడ భారీ స్కోర్లు బాదుతున్నారు. దీంతో అసలైన ముప్పు ఆ జట్టుతోనే అని పలువురు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆఫ్ఘానిస్థాన్‌ను తక్కువ అంచనా వేయొద్దని అన్నాడు. ఆ టీమ్‌ను తేలిగ్గా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కెప్టెన్ రోహిత్ శర్మను హెచ్చరించాడు భజ్జీ.
‘ఆఫ్ఘానిస్థాన్ మంచి జట్టు. ఆ టీమ్ బాగా ఆడుతోంది. అతి తక్కువ సమయంలో ఆ టీమ్ చాలా ఎత్తుకు ఎదిగింది. ఆఫ్ఘాన్ స్క్వాడ్‌లో రషీద్ ఖాన్, మహ్మద్ నబి లాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఈ టోర్నమెంట్లో ఆ జట్టు స్పిన్ అటాకే బెస్ట్. ఆఫ్ఘానిస్థాన్‌లో సూపర్బ్ స్పిన్నర్లు ఉన్నారు. వాళ్ల బ్యాటింగ్ యూనిట్ కూడా బలంగా ఉంది. వాళ్ల అడ్డగోలు షాట్లు ఆడి వికెట్లు పారేసుకునే రకం కాదు. వన్డే ప్రపంచ కప్-2023 ఆడాక ఆ టీమ్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆఫ్ఘాన్ బ్యాటర్లకు సిచ్యువేషన్‌కు తగ్గట్లు ఎలా ఆడాలో బాగా తెలుసు. తమదైన రోజున ఎంతటి బిగ్ టీమ్‌ను అయినా ఓడించే సత్తా వాళ్లకు ఉంది. కనుక లైట్ తీసుకోవద్దు. ఒకవేళ టాస్ నెగ్గి ఆరంభ ఓవర్లలో కొన్ని విషయాలు వాళ్లకు అనుకూలంగా వెళ్తే మ్యాచ్ తారుమారయ్యే ప్రమాదం ఉంది’ అని హర్భజన్ స్పష్టం చేశాడు. మరి.. ఆఫ్ఘాన్‌తో జాగ్రత్త అంటూ భజ్జీ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Harbhajan Singh “Afghanistan is a very good team.They have the Rashid Khan and Nabi.their spinners are probably the best in the tournament.they can defeat any big team. And when they are playing against Team India,they shouldn’t be underestimated.”pic.twitter.com/ZPmLWshgH0
— Sujeet Suman (@sujeetsuman1991) June 19, 2024