Nidhan
ఆఫ్ఘాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో గెలుచుకుంది. ఎంతో ఉత్కంఠగా సాగిన చివరి టీ20లో 10 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ప్రత్యర్థి బ్యాటర్ రోహిత్ సేనను భయపెట్టాడు. అతడే గుల్బదీన్ నయీబ్.
ఆఫ్ఘాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో గెలుచుకుంది. ఎంతో ఉత్కంఠగా సాగిన చివరి టీ20లో 10 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ప్రత్యర్థి బ్యాటర్ రోహిత్ సేనను భయపెట్టాడు. అతడే గుల్బదీన్ నయీబ్.
Nidhan
చివరి మ్యాచ్‌లోనూ నెగ్గి మూడు టీ20ల సిరీస్‌లో ఆఫ్ఘానిస్థాన్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమ్ కాంబినేషన్ విషయంలో పలు ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది. అయితే ఆఖరి టీ20లో ఆఫ్ఘానిస్థాన్ పోరాడిన తీరును అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. చివరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో విజయం భారత్‌ను వరించింది. అయితే ఆఫ్ఘాన్ల పోరాటం అందరి మనసులు గెలుచుకుంది. టీమిండియా లాంటి టాప్ టీమ్ మీద ఆ జట్టు ఆడిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. అందులోనూ ఆ జట్టు సీనియర్ బ్యాటర్ గుల్బదీన్ నయీబ్ బ్యాటింగ్ చేసిన తీరును ప్రశంసించాల్సిందే. ఎదురుగా ఉన్నది 212 పరుగుల భారీ టార్గెట్. వరుసగా వికెట్లు పడుతున్నాయి. అయినా ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను డ్రా చేశాడు గుల్బదీన్. దీంతో అతడి గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
గుల్బదీన్ నయీబ్.. పసికూనగా ఉన్న ఆఫ్ఘానిస్థాన్ జట్టుకు పోరాడటం నేర్పిన వారిలో ఒకడు. గత 13 ఏళ్లుగా ఆఫ్ఘాన్ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న సీనియర్ బ్యాటర్లలో ఒకడు. ఇప్పటిదాకా 79 వన్డేలు ఆడిన గుల్బదీన్ 1,207 పరుగులు చేశాడు. 63 టీ20 మ్యాచుల్లో 787 పరుగులు చేశాడు. బ్యాట్‌తోనే గాక బంతితోనూ మ్యాజిక్ చేసే ఈ 32 ఏళ్ల ఆటగాడు 50 ఓవర్ల ఫార్మాట్లో 72 వికెట్లు తీశాడు. టీ20ల్లో 26 వికెట్లు పడగొట్టాడు. భారీగా పరుగులు చేయకపోయినా డేంజరస్ బ్యాటర్‌గా, ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడతను. ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయే స్థితిలో ఉన్న ఆఫ్ఘాన్‌ను ఆదుకొని సింగిల్ హ్యాండ్‌తో విజయాలు అందించాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్ క్రికెట్లో 126 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేస్తూ వస్తున్నాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూనే భారీ షాట్లతో స్కోరు బోర్డును పరిగెత్తించడంలో గుల్బదీన్ ఆరితేరాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్-2024లో ఆఫ్ఘాన్ నుంచి గమనించదగ్గ ప్లేయర్లలో అతను ఒకడిగా ఉన్నాడు.
ఆఫ్ఘాన్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న గుల్బదీన్ భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ సత్తా చాటాడు. చివరి టీ20లో 23 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. 4 బౌండరీలతో పాటు 4 భారీ సిక్సులతో రెచ్చిపోయాడు. 239 స్ట్రయిక్ రేట్‌తో రన్స్ చేస్తూ భారత బౌలర్లను భయపెట్టాడు. ఒకదశలో టీమిండియా ఈజీగా గెలుస్తుందని అనిపించింది. కానీ మహ్మద్ నబీ (34) అండతో గుల్బదీన్ విజృంభించి ఆడటంతో మ్యాచ్ ఆఫ్ఘాన్ వైపు తిరిగింది. ఈ మ్యాచ్ డ్రా అయ్యిందంటే అది అతడి వల్లే. అతడే పోరాడకపోయి ఉంటే భారత్ అలవోకగా గెలిచేది. గుల్బదీన్ తన ఫైటింగ్ స్పిరిట్‌తో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడు ఇలాగే కన్సిస్టెంట్గా రాణిస్తే ఆఫ్ఘాన్ మరిన్ని సంచలనాలు నెలకొల్పడం ఖాయమని చెబుతున్నారు. మరి.. మూడో టీ20లో గుల్బదీన్ బ్యాటింగ్ చేసిన తీరు పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs AFG: రోహిత్ తర్వాత.. మెచ్చుకోవాల్సింది ఈ ఇద్దర్నే! వారి వల్లే గెలిచాం
Always knew Gulbadin Naib is a dangerous player since the day he made this statement. #INDvAFG pic.twitter.com/2jpszAgDNC
— Johns (@JohnyBravo183) January 17, 2024
Its time for the super over 😲
Gulbadin Naib the hero for Afghanistan 🔥#INDvsAFG | #CricketTwitter pic.twitter.com/CIki4Yo2bs
— CricWatcher (@CricWatcher11) January 17, 2024