Nidhan
టీమిండియా మరో సిరీస్ గెలిచేందుకు అడుగు దూరంలో ఉంది. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే రెండో టీ20లో నెగ్గితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా మరో సిరీస్ గెలిచేందుకు అడుగు దూరంలో ఉంది. ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే రెండో టీ20లో నెగ్గితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను ఊహించినట్లుగానే గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది టీమిండియా. తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘాన్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు రెండో మ్యాచులోనూ నెగ్గి సిరీస్‌ను పట్టేయాలని చూస్తోంది. ఈ సిరీస్ గెలవడం రోహిత్ సేనకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని ప్రయోగాలు చేయాలని అనుకుంటోంది టీమిండియా. పొట్టి ఫార్మాట్లో జరిగే ప్రపంచ కప్‌కు ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే కానుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్, ఐపీఎల్ అంటూ బిజీ అయిపోనుంది. దీంతో టీమ్ కాంబినేషన్ విషయంలో ఒక అంచనాకు వచ్చేందుకు మిగిలిన రెండు టీ20లను ఫుల్‌గా యూజ్ చేసుకోవాలని కెప్టెన్ రోహిత్‌తో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫిక్స్ అయ్యారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వనుండటంతో ఇవాళ జరిగే రెండో టీ20 ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సెకండ్ టీ20లో భారత జట్టులో ప్రధానంగా రెండు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ ఆటగాడు కోహ్లీ రీఎంట్రీ ఇస్తుండటంతో హైదరాబాదీ తిలక్ వర్మ బెంచ్‌కు పరిమితం అవుతాడు. టీ20 కెరీర్‌ను గొప్పగా స్టార్ట్ చేసిన తిలక్ దాన్ని కంటిన్యూ చేయడంలో మాత్రం తడబడుతున్నాడు. గత 13 ఇన్నింగ్స్‌ల్లో ఈ లెఫ్టాండర్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. కాబట్టి కోహ్లీ రాకతో తిలక్ బెంచ్‌కు వెళ్లడం ఖాయం. శుబ్‌మన్ గిల్ కూడా ఆడేది కష్టంగానే ఉంది. ఆరోగ్య సమస్యలతో ఫస్ట్ టీ20కి దూరమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫిట్నెస్ సాధిస్తే గిల్ కూడా బెంచ్‌పై కూర్చోవాల్సిందే. కాబట్టి రోహిత్ శర్మకు జతగా గిల్, జైస్వాల్ల్లో ఒకరు మాత్రమే ఓపెనర్‌గా ఆడాల్సి ఉంటుంది. ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. తొలి టీ20లో అటు బౌలింగ్‌లో కీలక వికెట్ తీయడంతో పాటు ఇటు బ్యాటింగ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంతో మరోసారి తనపై అందరి ఫోకస్ పడేలా చేశాడు.
టీ20 వరల్డ్ కప్-2024 స్క్వాడ్‌లో చోటు దక్కించుకోవాలంటే ఆఫ్ఘాన్‌తో జరిగే తదుపరి రెండు టీ20లనూ దూబె చక్కగా వినియోగించుకోవాలి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అతడు మరింత ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో అతడు పోటీపడే ఛాన్స్ ఉంటుంది. ఇక, రెండో టీ20లో బ్యాటింగ్‌లో రోహిత్, కోహ్లీ, దూబెతో పాటు వికెట్ కీపర్ జితేష్ శర్మ, రింకూ సింగ్ ప్లేసెస్ ఫిక్స్. జైస్వాల్, గిల్లో ఎవరో ఒకరు మాత్రమే ఆడతారు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కంటిన్యూ అవుతాడు. తొలి టీ20లో ఆడిన పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్‌ను రెండో టీ20లోనూ ఆడించొచ్చు. ఫస్ట్ మ్యాచ్‌లో విఫలమైన వాషింగ్టన్ సుందర్నూ కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. చాన్నాళ్లుగా బెంచ్ పైనే ఉంటున్న సుందర్‌కు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందట. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాటింగ్ హెవెన్‌గా మారింది. మంచు పడే ఛాన్స్ ఉంది కాబట్టి టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్‌కు వెళ్లే ఆస్కారం ఉంది. మరి.. రెండో టీ20లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్/శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబె, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్.
ఇదీ చదవండి: రోహిత్‌పై యువీ షాకింగ్ కామెంట్స్.. గ్రేట్ కెప్టెనే కానీ..!
India’s top 3 in the practice session.
– Time to seal the series tonight!! 🇮🇳 pic.twitter.com/Kz4JNrv5YH
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2024