iDreamPost
android-app
ios-app

IND vs AFG: ఆఫ్ఘానిస్థాన్​తో తొలి టీ20.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Jan 11, 2024 | 8:47 AM Updated Updated Jan 11, 2024 | 8:47 AM

టీమిండియా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య ఇవాళ తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్​లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య ఇవాళ తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్​లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 11, 2024 | 8:47 AMUpdated Jan 11, 2024 | 8:47 AM
IND vs AFG: ఆఫ్ఘానిస్థాన్​తో తొలి టీ20.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఈ ఏడాది జూన్​ 1వ తేదీన టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. ఈ పొట్టి కప్​పై కన్నేసిన టీమిండియా.. దీని కంటే ముందు టీ20 ఫార్మాట్​లో చివరి సిరీస్ ఆడేందుకు రెడీ అయింది. ఆఫ్ఘానిస్థాన్​తో మూడు మ్యాచుల సిరీస్​లో తలపడేందుకు సిద్ధమైంది భారత్. ఈ సిరీస్​లోని తొలి టీ20 గురువారం జరగనుంది. 14 నెలల గ్యాప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి చేరారు. అయితే పర్సనల్ రీజన్స్ వల్ల కోహ్లీ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు. ఇంజ్యురీ వల్ల హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో లేకుండా పోయారు. టీ20ల్లో కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తున్న ఇషాన్ కిషన్ కూడా ఈ సిరీస్​లో ఆడట్లేదు. ఎక్కువగా యువకులతో నిండిన భారత జట్టు కొత్తగా కనిపిస్తోంది. తొలి టీ20లో గెలిచి సిరీస్​లో శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

ఫస్ట్ టీ20లో భారత జట్టులో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఫస్ట్ డౌన్​లో శుబ్​మన్ గిల్ ఎలాగూ ఉన్నాడు. విరాట్ కోహ్లీ లేడు కాబట్టి అతడి ప్లేస్​లో తిలక్ వర్మ ఆడే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపర్​గా సౌతాఫ్రికా టూర్​లో రాణించిన జితేష్ శర్మను టీమ్​లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ప్రొటీస్​ టూర్​లో వన్డేల్లో సెంచరీతో మెరిసిన సంజూ శాంసన్​ అతడికి గట్టి పోటీని ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్​మెంట్ ఎవరిని తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఫినిషర్​ రోల్​ను రింకూ సింగ్ నిర్వర్తించనున్నాడు. స్పిన్​ ఆల్​రౌండర్​గా అక్షర్ పటేల్ గ్రౌండ్​లోకి దిగడం ఖాయం. మెయిన్ స్పిన్నర్​గా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్​ల్లో ఎవర్ని ఆడిస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. బిష్ణోయ్​కు బ్యాటింగ్ చేసే ఎబిలిటీ కూడా ఉంది. కాబట్టి అతడ్ని తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

playing 11

పేస్ బౌలింగ్ బాధ్యతల్ని అర్ష్​దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్ మోస్తారు. పేస్ బౌలింగ్​, బ్యాటింగ్, ఆల్​రౌండర్స్​ పరంగా అందరి ప్లేసులు పక్కాగా కనిపిస్తున్నాయి. కానీ వికెట్ కీపర్, మెయిన్ స్పిన్నర్​గా ఎవర్ని ఆడిస్తారనేది చూడాలి. ఫస్ట్ టీ20కి ఆతిథ్యం ఇస్తున్న మొహాలీ పిచ్ ఈ మధ్య కాలంలో పూర్తి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారింది. కాబట్టి ఇక్కడ టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపుతుంది. అయితే ప్రయోగాలు చేయాలంటే భారత్​ మొదటి మ్యాచ్ నుంచే స్టార్ట్ చేయాలి. సిరీస్ గెలవడం కంటే టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం మీద ఫోకస్ చేస్తే బెటర్. ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్లుగా పెర్ఫార్మ్ చేస్తే సిరీస్ నెగ్గడం పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి ఏ ప్లేయర్​ను ఎప్పుడు బరిలోకి దిగాలి? ఎవరి రోల్ ఏంటి? వరల్డ్ కప్​లో ఎవరెవరు పక్కాగా ఆడతారు? అనే విషయంలో టీమ్ మేనేజ్​మెంట్​ క్లారిటీ తెచ్చుకోవాలి. మరి.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​లో ఇంకా ఎవరైనా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

భారత జట్టు (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్/జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అర్ష్​దీప్ సింగ్, అవేశ్ ఖాన్, కుల్​దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్.

ఇదీ చదవండి: సచిన్, కోహ్లీ కాదు.. ఆ టీమిండియా క్రికెటర్ కు నేను అభిమానిని: డివిలియర్స్