iDreamPost
android-app
ios-app

స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సెన్సేషనల్ కామెంట్స్.. ఒక్క పోస్ట్​తో BCCIకి ఇచ్చిపడేశాడు!

  • Published Jun 24, 2024 | 10:03 PM Updated Updated Jun 24, 2024 | 10:34 PM

స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాలెంగ్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన ఆఫ్ స్పిన్​ బౌలింగ్​తో ఎంతో మంది అభిమానాన్ని అతడు సంపాదించాడు. ఐపీఎల్​తో పాటు టీమిండియా తరఫున కూడా ఆడుతూ మంచి ఫ్యాన్ బేస్​ను ఏర్పరచుకున్నాడు.

స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాలెంగ్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన ఆఫ్ స్పిన్​ బౌలింగ్​తో ఎంతో మంది అభిమానాన్ని అతడు సంపాదించాడు. ఐపీఎల్​తో పాటు టీమిండియా తరఫున కూడా ఆడుతూ మంచి ఫ్యాన్ బేస్​ను ఏర్పరచుకున్నాడు.

  • Published Jun 24, 2024 | 10:03 PMUpdated Jun 24, 2024 | 10:34 PM
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సెన్సేషనల్ కామెంట్స్.. ఒక్క పోస్ట్​తో BCCIకి ఇచ్చిపడేశాడు!

స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాలెంగ్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన ఆఫ్ స్పిన్​ బౌలింగ్​తో ఎంతో మంది అభిమానాన్ని అతడు సంపాదించాడు. ఐపీఎల్​తో పాటు టీమిండియా తరఫున కూడా ఆడుతూ మంచి ఫ్యాన్ బేస్​ను ఏర్పరచుకున్నాడు. అయితే ఎంత టాలెంట్ ఉన్నా కాలం కలసి రాకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. వరుణ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. భారత జట్టులోకి వచ్చి కొన్ని మ్యాచులు ఆడిన అతడు.. టీమ్​లో సెటిల్ అయ్యే లోపే దూరమయ్యాడు. ఆ తర్వాత రీఎంట్రీ కోసం ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయినా సరే అతడు మాత్రం తన పోరాటం ఆపలేదు. ఈ ఏడాది ఐపీఎల్​లో కూడా సూపర్బ్ బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు. కోల్​కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంలో అతడిది కీలక పాత్ర.

ఐపీఎల్-2024లో 15 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు వరుణ్ చక్రవర్తి. అతడి ఎకానమీ కూడా 8.04గా ఉంది. దీన్ని బట్టే వరుణ్ ఎంతగా సక్సెస్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. లీగ్ స్టేజ్​తో పాటు నాకౌట్ మ్యాచెస్​లోనూ అతడు రాణించాడు. దీంతో భారత జట్టులోకి అతడి రీఎంట్రీ పక్కా అని అంతా అనుకున్నారు. టీ20 వరల్డ్ కప్ కాదు.. గానీ తర్వాతి ఏదైనా సిరీస్​ల్లో అతడ్ని టీమ్​లోకి తీసుకుంటారని భావించారు. కానీ వరుణ్​కు మొండిచెయ్యి ఎదురైంది. తాజాగా ప్రకటించిన జింబాబ్వే సిరీస్​లో అతడికి చోటు దక్కలేదు. దీంతో హర్ట్ అయిన కేకేఆర్ స్పిన్నర్.. ఒక్క పోస్ట్​తో సెలెక్టర్లు, బీసీసీఐకి ఇచ్చిపడేశాడు. పీఆర్ ఏజెన్సీలను పెట్టుకొని పబ్లిసిటీ చేసుకునే వాళ్లకే జట్టులో చోటు దక్కుతుందనే అర్థం వచ్చేలా నెట్టింట ఓ పోస్ట్ పెట్టాడు. ఓ పీఆర్ ఏజెన్సీకి డబ్బులు చెల్లిస్తూ పబ్లిసిటీ చేసుకుంటే బాగుండేదని చెప్పాడు. తద్వారా టీమ్​ సెలెక్షన్ మీద తన కోపాన్ని బయటపెట్టాడు. అతడి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. సెలెక్టర్లను టార్గెట్ చేస్తూ వరుణ్ చక్రవర్తి చేసిన పోస్ట్​పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.