సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటనకు షెడ్యూల్‌ ఖరారు

భారత జట్టు డిసెంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు టీమిండియా.. ప్రొటీస్‌ గడ్డపై అడుగుపెట్టనుంది. డిసెంబర్‌ 10 నుంచి 2024 జనవరి 24 వరకు ఈ సిరీస్‌ సాగనుంది. భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌ 2023 తర్వాత ఈ సిరీస్‌ మొదలవనుంది.

డర్బన్‌లో డిసెంబర్‌ 10న తొలి టీ20, జీక్యూఏబహాలో 12న రెండో టీ20, జోహన్నెస్‌బర్గ్ వేదికగా 14న మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఇక 17 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ మొదలవనుంది. 17న తొలి వన్డే జోహన్నెస్‌బర్గ్‌లో, 19న రెండో వన్డే జీక్యూఏబహాలో, 21న పార్ల్‌ వేదికగా మూడో వన్డే నిర్వహించనున్నారు. ఇక గాంధీ-మండేలా సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల సిరీస్‌ జరగనుంది. డిసెంబర్‌ 23 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు, కేప్‌టౌన్‌లో 2024 జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్టు జరగనుంది.

ఈ లాంగ్‌ సిరీస్‌లో టీమిండియా ఎక్కువగా టీ20 సిరీస్‌పైనే గురిపెట్టనుంది. ఎందుకంటే అదే ఏడాది సౌతాఫ్రికాలో టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహించనున్నారు. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ను టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. మళ్లీ అదే సౌతాఫ్రికా గడ్డపై పొట్టి ప్రపంచ కప్‌ను గెలవాలని భారత జట్టు ఇప్పటి నుంచే గట్టి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మరి సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా విజయావకాశాలపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పానీపూరి నుంచి టీమిండియా ఫ్యూచర్‌ స్టార్‌గా! సక్సెస్‌ స్టోరీ

Show comments