Nidhan
Team India: శ్రీలంక టూర్ భారత్‌కు మిక్స్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది. జట్టుతో పాటు మన దేశ క్రికెట్ బోర్డుకు కూడా ఈ సిరీస్ పలు పాఠాలు నేర్పింది.
Team India: శ్రీలంక టూర్ భారత్‌కు మిక్స్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది. జట్టుతో పాటు మన దేశ క్రికెట్ బోర్డుకు కూడా ఈ సిరీస్ పలు పాఠాలు నేర్పింది.
Nidhan
శ్రీలంక టూర్ భారత్‌కు మిక్స్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూ విజేతగా నిలిచింది. మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఇదే జోరులో వన్డే సిరీస్‌లో కూడా ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేయడం ఖాయమని అంతా భావించారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి టాప్ బ్యాటర్స్ అంతా కమ్‌బ్యాక్ ఇవ్వడంతో లంక ఖేల్ ఖతం అని అనుకున్నారు. ఆ టీమ్ గట్టి పోటీనిస్తే అదే గొప్పని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. లోకల్ కండీషనర్స్‌ను బాగా ఉపయోగించుకున్న ఆతిథ్య జట్టు.. మన టీమ్‌ను వరుస మ్యాచుల్లో ఓడించింది.
భారత బ్యాటర్ల స్పిన్ వీక్నెస్పై గట్టిగా కొట్టింది శ్రీలంక. వరుస మ్యాచుల్లో ఓడించి 2-0తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ వైఫల్యం జట్టుతో పాటు మన దేశ క్రికెట్ బోర్డుకు కూడా పలు పాఠాలు నేర్పింది. ఎట్టకేలకు మేలుకొన్న బీసీసీఐ తదుపరి సిరీస్‌ల విషయంలో జాగ్రత్తగా ఉంటోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. చిన్న జట్టు, పెద్ద జట్టు అనే తేడాల్లేకుండా ప్రతి సిరీస్‌ను అంతే ముఖ్యంగా భావిస్తూ టీమ్‌ను సమాయత్తం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆఖర్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఒక డే/నైట్ మ్యాచ్‌ను ప్లాన్ చేస్తోంది.
గత ఆసీస్ పర్యటనలో డే అండ్ నైట్ టెస్ట్‌లో భారత్ దారుణంగా ఓడింది. 36 రన్స్‌కే కుప్పకూలింది. ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఆఖర్లో జరిగే టూర్లో రెండ్రోజుల డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ప్లాన్ చేస్తోంది. దీనికి కంగారూ బోర్డు కూడా ఓకే చెప్పింది. కాన్బెర్రా వేదికగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 మధ్య ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో ఈ మ్యాచ్ జరగనుంది. ఆసీస్ టూర్ నవంబర్ 15న మొదలవనుంది. కాగా, లంక టూర్లో ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా నేరుగా బరిలోకి దిగి చేతులు కాల్చుకుంది టీమిండియా. స్పిన్ పిచ్‌లు కదా ఈజీగా ఆడేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోయి సిరీస్‌ను కోల్పోయింది. ఆసీస్‌లో కూడా గతంలో ఇలాంటి అనుభవం ఉండటం, తాజాగా లంక సిరీస్ నేర్పిన పాఠంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం, లోకల్ కండీషన్స్‌కు అలవాటు పడటం ఎంత కీలకమో బీసీసీఐ గ్రహించింది. అందుకే తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంది. అయితే ఈ పనేదో ముందే చేస్తే లంకతో సిరీస్ గెలిచేవాళ్లమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.