Mohammed Shami Batting Pics Goes Viral: ఈ టీమిండియా స్టార్​ను గుర్తుపట్టారా? బాల్ చేతబడితే బ్యాటర్లకు నరకమే!

ఈ టీమిండియా స్టార్​ను గుర్తుపట్టారా? బాల్ చేతబడితే బ్యాటర్లకు నరకమే!

Team India: టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో ఒంటిచేత్తో విజయాలు అందించిన ప్లేయర్ అతడు. బాల్ చేతబట్టాడా బ్యాటర్లకు నరకం చూపిస్తాడు. అతడు ఎవరో ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది.

Team India: టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో ఒంటిచేత్తో విజయాలు అందించిన ప్లేయర్ అతడు. బాల్ చేతబట్టాడా బ్యాటర్లకు నరకం చూపిస్తాడు. అతడు ఎవరో ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది.

క్రికెట్​లో బౌలర్ల విషయంలో పార్షియాలిటీ ఉంటుందని కొందరు ఎక్స్​పర్ట్స్ అంటుంటారు. గ్రౌండ్​లో కాదు గానీ పాపులారిటీ విషయంలో మాత్రం ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. బౌలర్లు మ్యాచ్​లు గెలిపించినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే బ్యాటర్ల వల్ల నెగ్గితే అహో ఒహో అంటూ పొగుడుతారు. బ్యాటర్ల కోసం స్పాన్సర్లు క్యూ కడతారు. ధనార్జన, క్రేజ్, పాపులారిటీ.. ఇలా ఎందులో చూసుకున్నా బ్యాటర్లదే హవా నడుస్తుంది. అయితే ఇందులో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. కొందరు బౌలర్లు అద్భుతమైన ఆటతీరుతో పేరు, క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఒంటిచేత్తో జట్లకు విజయాలు అందిస్తూ స్టార్​డమ్​ను సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఇతనొకడు.

టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో సింగిల్ హ్యాండ్​తో విజయాలు అందించిన ప్లేయర్ అతడు. బాల్ చేతబట్టాడా బ్యాటర్లకు నరకం చూపిస్తాడు. పదునైన వేగం, స్వింగింగ్ డెలివరీస్​తో ప్రత్యర్థి జట్లకు ఊపిరాడకుండా చేస్తాడు. బుల్లెట్ స్పీడ్​తో నిలకడగా బంతులు వేస్తూ బ్యాటర్లకు ప్రశ్నలు సంధిస్తుంటాడు. అతడి ధాటిని తట్టుకోలేక మోడర్న్ గ్రేట్స్ కూడా తోకముడిచారు. అతడెవరో గుర్తుపట్టే ఉంటారు. ఆ ఆటగాడు మరెవరో కాదు.. భారత పేస్ గన్ మహ్మద్ షమి. దశాబ్ద కాలానికి పైగా మెన్ ఇన్ బ్లూకు సేవలు అందిస్తూ వస్తున్నాడతను. షమి పేరు చెబితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్ లాంటి టాప్ టీమ్స్ కూడా షేక్ అవుతాయి. గంటకు 145 కిలోమీటర్లకు తగ్గని వేగం, ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ చేస్తూ అతడు వేసే డెలివరీస్​కు బోల్తా పడని బ్యాటర్లు లేరు.

ప్రస్తుత క్రికెట్​లో టాప్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు షమి. వన్డే వరల్డ్ కప్-2023లో 24 వికెట్లు తీసి భారత్​ ఫైనల్​కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ టోర్నీలో గాయంతో బాధపడుతూనే కంటిన్యూ అయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని క్రికెట్​కు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న షమి.. తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. స్లో రనప్​తో బౌలింగ్ స్టార్ట్ చేసిన స్టార్ పేసర్.. బ్యాట్ కూడా పట్టి సాధన చేస్తున్నాడు. నెట్స్​లో షమి షాట్లు బాదుతున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్‌.. కమ్​బ్యాక్​లో బౌలింగ్​లోనే కాదు, బ్యాటింగ్​లోనూ ఇరగదీయాలని అంటున్నారు. మరి.. షమి రీఎంట్రీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments