iDreamPost
android-app
ios-app

భారత్ తప్పు చేసింది.. దూబేను తీసేసి రాహుల్​ను ఆడించాల్సింది: పాక్ క్రికెటర్

  • Published Aug 08, 2024 | 8:28 PM Updated Updated Aug 08, 2024 | 8:28 PM

India vs Sri Lanka: పోటీ లేదు, మనకు సాటిలేదని అనుకుంటే శ్రీలంక లాంటి ప్రభ కోల్పోయిన టీమ్​ చేతిలో భారత్ ఓడిపోయింది. వైట్​వాష్ చేస్తుందని అనుకుంటే.. వరుస మ్యాచుల్లో ఓడి సిరీస్​ను పోగొట్టుకుంది.

India vs Sri Lanka: పోటీ లేదు, మనకు సాటిలేదని అనుకుంటే శ్రీలంక లాంటి ప్రభ కోల్పోయిన టీమ్​ చేతిలో భారత్ ఓడిపోయింది. వైట్​వాష్ చేస్తుందని అనుకుంటే.. వరుస మ్యాచుల్లో ఓడి సిరీస్​ను పోగొట్టుకుంది.

  • Published Aug 08, 2024 | 8:28 PMUpdated Aug 08, 2024 | 8:28 PM
భారత్ తప్పు చేసింది.. దూబేను తీసేసి రాహుల్​ను ఆడించాల్సింది: పాక్ క్రికెటర్

పోటీ లేదు, మనకు సాటిలేదని అనుకుంటే శ్రీలంక లాంటి ప్రభ కోల్పోయిన టీమ్​ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ జట్టును వైట్​వాష్ చేస్తుందని అనుకుంటే.. వరుస మ్యాచుల్లో ఓడి సిరీస్​ను పోగొట్టుకుంది టీమిండియా. లంక టూర్ మనకు మిక్స్​డ్ రిజల్ట్స్ అందించింది. తొలుత జరిగిన టీ20 సిరీస్​లో మెన్ ఇన్ బ్లూ ఎదురులేని ఆటతీరుతో విజేతగా నిలిచింది. మూడు టీ20ల సిరీస్​ను 3-0తో క్లీన్​స్వీప్ చేసింది. దీంతో వన్డే సిరీస్​లోనూ సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుందని అంతా ఊహించారు. పైగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లంతా దిగడంతో లంకకు దబిడిదిబిడేనని అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే.. సిరీస్​ను 0-2 తేడాతో కోల్పోయింది భారత్.

కెప్టెన్ రోహిత్ తప్పితే మిగిలిన బ్యాటింగ్ యూనిట్ ఫెయిల్ అవడం, బౌలర్లు అంచనాలను అందుకోకపోవడం, టీమ్ కాంబినేషన్ సెట్ కాకపోవడం ఇలా టీమిండియా ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు జట్టు ఓటమి గురించి చర్చ నడుస్తున్న తరుణంలోనే సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్​కు అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు, ఐదు నంబర్లలో ఆడే రాహుల్​ను తొలి రెండు వన్డేల్లో ఆరో, ఏడో పొజిషన్​లో ఆడించారు. ఆఖరి మ్యాచ్​లో అతడ్ని తీసేసి రిషత్ పంత్​ను టీమ్​లోకి తీసుకున్నారు. పంత్ విఫలమవడంతో రాహుల్ ఉంటే వికెట్ల పతనాన్ని ఆపి, ఇన్నింగ్స్​ను చక్కదిద్దేవాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ రియాక్ట్ అయ్యాడు.

చివరి వన్డేలో రాహుల్​ను ఆడించకుండా టీమిండియా తప్పు చేసిందన్నాడు కమ్రాన్ అక్మల్. కావాలంటే శివమ్ దూబేను తీసేసి అతడ్ని ఆడించాల్సిందని, కథ వేరేలా ఉండేదన్నాడు. దీనిపై ఒక్కసారి ఆలోచించాల్సిందన్నాడు. ‘కేఎల్ రాహుల్​ను బెంచ్​పై కూర్చోబెట్టడం షాకింగ్​గా అనిపించింది. అతడు ఓపెనర్. కానీ కీపింగ్ చేయగలడనే ఉద్దేశంతో 8వ నంబర్​లో ఆడించారు. అయినా ఓకే, కానీ టీమ్​లో నుంచి తీసేయడం కరెక్ట్ కాదు. కావాలంటే దూబేను తీసేయాల్సింది. సిరాజ్​తో పాటు ఇంకో ఎండ్​లో అక్షర్ పటేల్​ వంటి స్పిన్నర్​తో బౌలింగ్ చేయించాల్సింది. రియాన్ పరాగ్​తో కూడా బౌలింగ్ వేయించొచ్చు. కానీ రాహుల్​ను తీసుకోకపోవడం కరెక్ట్ కాదు. అతడు ఉంటే టీమ్ బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉండేది’ అని అక్మల్ చెప్పుకొచ్చాడు. మరి.. రాహుల్​ను ఆడించకుండా తప్పు చేశారనే వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş