iDreamPost

నెరవేరిన నితీష్ కల.. తెలుగోడి ప్రతిభకు BCCI గుర్తింపు!

  • Published Jun 24, 2024 | 8:03 PMUpdated Jun 24, 2024 | 8:03 PM

ఐపీఎల్-2024లో దుమ్మురేపాడు సన్​రైజర్స్ ఆల్​రౌండర్ నితీష్ రెడ్డి. సొగసైన బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్, అదిరిపోయే బౌలింగ్​తో అందరి మనసులు దోచుకున్నాడీ తెలుగోడు. మొత్తానికి అతడి ప్రతిభకు గుర్తింపు లభించింది.

ఐపీఎల్-2024లో దుమ్మురేపాడు సన్​రైజర్స్ ఆల్​రౌండర్ నితీష్ రెడ్డి. సొగసైన బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్, అదిరిపోయే బౌలింగ్​తో అందరి మనసులు దోచుకున్నాడీ తెలుగోడు. మొత్తానికి అతడి ప్రతిభకు గుర్తింపు లభించింది.

  • Published Jun 24, 2024 | 8:03 PMUpdated Jun 24, 2024 | 8:03 PM
నెరవేరిన నితీష్ కల.. తెలుగోడి ప్రతిభకు BCCI గుర్తింపు!

నితీష్ కుమార్ రెడ్డి.. ఐపీఎల్-2024 టైమ్​లో బాగా మార్మోగిన పేరు. గత సీజన్ వరకు అతడు అంటే ఎవరికీ తెలియదు. కానీ ఏడాది గ్యాప్​లో క్యాష్ రిచ్ లీగ్​లో అందరి నోటా ఈ సన్​రైజర్స్ హైదరాబాద్ ఆటగాడి పేరే వినిపించింది. దీనికి కారణం అతడి టాలెంటే. ఎస్​ఆర్​హెచ్ తరఫున బరిలోకి దిగి అద్బుతమైన బ్యాటింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్, అదిరిపోయే బౌలింగ్​తో అందరి మనసులు దోచుకున్నాడు నితీష్​ రెడ్డి. మిడిలార్డర్​లో బ్యాటింగ్​కు వస్తూ ఎన్నో మ్యాచుల్లో ఆరెంజ్ ఆర్మీని గట్టున పడేశాడు. టీమ్ భారీ స్కోర్లు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఎదురుగా ఎలాంటి బౌలింగ్ అటాక్ ఉన్నా సరే బెదరకుండా క్రీజులో పాతుకుపోయాడు. స్ట్రైక్ రొటేషన్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా భారీ షాట్లు బాదుతూ అందరి ఫోకస్​ను తన వైపునకు తిప్పుకున్నాడు. అతడి ఆటతీరుకు గానూ ఈ ఐపీఎల్ సీజన్​లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ఇయర్ అవార్డు కూడా దక్కింది.

నితీష్​ రెడ్డి ఆటతీరు చూసి చాలా మంది మాజీ క్రికెటర్లు మెచ్చుకున్నారు. భారత క్రికెట్​లో నెక్స్ట్ బిగ్ థింగ్ అతడే అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. టీ20 వరల్డ్ కప్​కు వెళ్లే జట్టులో అతడికి చోటు గ్యారెంటీ అన్నారు. అయితే పొట్టి కప్పు స్క్వాడ్​లో నితీష్​కు ప్లేస్ దక్కలేదు. దీంతో తెలుగోడి అభిమానులు నిరాశ చెందారు. కానీ వాళ్లకో బిగ్ న్యూస్. నితీష్ బంపర్ ఛాన్స్ కొట్టేశాడు. జింబాబ్వే టూర్​కు వెళ్లే భారత జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. త్వరలో టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నాడీ తెలుగు క్రికెటర్. ఐపీఎల్​లో ఆల్​రౌండర్ పెర్ఫార్మెన్స్​తో రఫ్ఫాడించిన అతడి ప్రతిభను బీసీసీఐ గుర్తించి టీమిండియా టికెట్ ఇచ్చింది. మెన్ ఇన్ బ్లూలోకి నితీష్ ఎంట్రీకి సర్వం సిద్ధమవడంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

ఇక, జింబాబ్వే సిరీస్​కు మొత్తంగా 15 మందితో కూడిన జట్టును అనౌన్స్ చేశారు భారత సెలెక్టర్లు. ఈ టీమ్​కు యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​ను కెప్టెన్​గా సెలెక్ట్ చేశారు. నితీష్ రెడ్డి, శుబ్​మన్ గిల్​తో పాటు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, ధృవ్ జురెల్ కూడా జింబాబ్వే టూర్​కు వెళ్లనున్నారు. వీళ్లతో పాటు రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్​పాండే కూడా ఈ సిరీస్​లో ఆడనున్నారు. మూడు ఫార్మాట్లలోనూ బ్యాటర్​గా కీలక పాత్ర పోషిస్తున్న గిల్​కు సారథిగా ప్రమోషన్ ఇచ్చారు సెలెక్టర్లు. ఐపీఎల్​లో రాణించిన నితీష్​, అభిషేక్, పరాగ్, దేశ్​పాండేను టీమ్​లోకి తీసుకున్నారు. అయితే క్యాష్​ రిచ్ లీగ్​లో సూపర్బ్ బ్యాటింగ్​తో అందర్నీ ఇంప్రెస్ చేసిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మకు మాత్రం మొండిచెయ్యి ఎదురైంది. వాళ్లను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. మరి.. నితీష్ రెడ్డికి భారత జట్టు నుంచి పిలుపు అందడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి