iDreamPost
android-app
ios-app

వీడియో: పాకిస్థాన్‌ బౌలర్‌ను పిచ్చికొట్టుడు కొట్టిన నిఖిల్‌ చౌదరీ!

  • Published Jan 01, 2024 | 5:43 PM Updated Updated Jan 01, 2024 | 5:43 PM

ఇండియాలో పుట్టిన నిఖిల్‌ చౌదరీ.. ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. అక్కడ ఆడటమే కాదు.. ఆ లీగ్‌లో ఓ పాకిస్థానీ స్టార్‌ బౌలర్‌కు చుక్కలు చూపించాడు.

ఇండియాలో పుట్టిన నిఖిల్‌ చౌదరీ.. ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. అక్కడ ఆడటమే కాదు.. ఆ లీగ్‌లో ఓ పాకిస్థానీ స్టార్‌ బౌలర్‌కు చుక్కలు చూపించాడు.

  • Published Jan 01, 2024 | 5:43 PMUpdated Jan 01, 2024 | 5:43 PM
వీడియో: పాకిస్థాన్‌ బౌలర్‌ను పిచ్చికొట్టుడు కొట్టిన నిఖిల్‌ చౌదరీ!

అదేంటి నిఖిల్‌ చౌదరీ అనే క్రికెటర్‌ మన టీమ్‌లో లేడు కదా.. మరీ పాకిస్థాన్‌ బౌలర్‌ను ఎలా చితక్కొట్టాడు అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ నిఖిల్‌ చౌదరీ టీమిండియా క్రికెటర్‌ కాదు, కానీ, భారత సంతతికి చెందిన ఆటగాడు. మన దేశ రాజధాని ఢిల్లీలో పుట్టాడు. ఆ తర్వాత అతని కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లడంతో అక్కడే స్థిరపడిపోయారు. అయితే.. ప్రస్తుతం ఈ నిఖిల్‌ చౌదరీ అనే కుర్రాడు.. బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. భారత్‌ నుంచి వలస వెళ్లి.. ఏకంగా బిగ్‌ బాష్‌ లాంటి మెగా లీగ్‌లో ఆడుతుండటం నిజంగా గొప్ప విషయం. అయితే.. బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడిన రెండో భారత సంతతికి చెందిన క్రికెటర్‌గా ఇప్పటికే నిఖిల్‌ చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించడంతో నిఖిల్‌కు బిగ్‌ బాష్‌లో ఆడే అవకాశం దక్కింది. ప్రస్తుతం నిఖిల్‌ చౌడరీ హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 28న హోబర్ట్ హరికేన్స్-మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిఖిల్‌ చౌదరీ విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో.. 200 స్ట్రైక్‌రేట్‌తో 32 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్‌.. హిట్టింగ్‌ చేయడంతో దిట్ట. ముఖ్యంగా డెత్‌ ఓవర్స్‌లో ఎలాంటి బౌలర్‌నైనా.. తన 360 డిగ్రీ ఆటతో ఓ ఆటాడుకుంటాడు.

ఇలా బిగ్‌ బాష్‌ లీగ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నిఖిల్‌ చౌదరీ.. మెల్‌బోర్న్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌కు చుక్కలు చూపించాడు. రౌఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో వరుసగా భారీ సిక్స్‌, ఫోర్‌తో రౌఫ్‌కు దిమ్మతిరిగేలా చేశాడు. ముఖ్యంగా సిక్స్‌ అయితే నెక్ట్స్‌ లెవెల్‌ అనుకోవాలి. అయితే.. ఆ ఓవర్‌లోనే సిక్స్‌ ఫోర్‌ తర్వాత ఐదో బంతికి నిఖిల్‌ అవుట్‌ అయ్యాడు. వేగంగా ఆడే క్రమంలో 16 బంతుల్లోనే 32 రన్స్‌ చేసిన నిఖిల్‌ పెవిలియన్‌ చేరాడు. మరి ఢిల్లీ నుంచి బిగ్‌బాష్‌ ఆడే స్థాయికి ఎదిగిన నిఖిల్‌ చౌదరీ జర్నీతో పాటు, పాక్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.