iDreamPost
android-app
ios-app

టీమిండియాకు అలాంటి ఆటగాడి అవసరం ఉంది: మాజీ క్రికెటర్‌

  • Published Aug 10, 2023 | 10:34 AM Updated Updated Aug 10, 2023 | 10:34 AM
  • Published Aug 10, 2023 | 10:34 AMUpdated Aug 10, 2023 | 10:34 AM
టీమిండియాకు అలాంటి ఆటగాడి అవసరం ఉంది: మాజీ క్రికెటర్‌

ప్రపంచంలోని మేటి జట్లలో టీమిండియా ఒకటి. మరికొన్ని వారాల్లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో హాట్‌ ఫేవరేట్స్‌లో కూడా భారత జట్టు ఒకటిగా ఉంది. అయితే.. దశాబ్దం పాటు టీమిండియా ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. ఈ మూడేళ్ల కాలంలోనే రెండు సార్లు వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వెళ్లినా.. రెండో సార్లు కూడా టీమిండియా రన్నరప్‌గానే నిలిచింది. పరిమితి ఓవర్ల సంగతి అటుంచితే.. టీమిండియా టెస్టుల్లో బాగానే ఆడుతున్నా.. ఎందుకో కప్పు మాత్రం కొట్టలేకపోతుంది. పైగా స్వదేశంలో జరిగే టెస్టుల్లో అద్భుతంగా ఆడుతున్న భారత జట్టు.. విదేశాల్లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతుంది.

ఈ విషయంపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ నాసర్‌ హుస్సేన్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘టీమిండియాకు బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్ లేదా మిచెల్ మార్ష్ తరహా క్రికెటర్ అవసరం ఉంది. విదేశాల్లో 6, 7వ స్థానంలో బ్యాటింగ్‌ చేసే నిఖార్సయిన ఆల్‌రౌండర్‌ కావాలి. అలాగే 10-15 ఓవర్లు బౌలింగ్ చేస్తూ.. వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న ఆల్‌రౌండర్‌ టీమిండియాలో ఉండాలని, ఆ జట్టు అతని అవసరం ఉంది’ అని అన్నాడు. అలాంటి ఆటగాడు టీమిండియాలో ఉంటే.. ఆ జట్టు విదేశాల్లో కూడా పటిష్టంగా మారుతుందని నాజర్‌ అభిప్రాయాపడ్డాడు.

అయితే.. ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్‌ అభిమానులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రవీంద్ర జడేజా రూపంలో టీమిండియాకు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ ఉన్నాడని, కొత్తగా స్టోక్స్‌, గ్రీన్‌ లాంటి ఆల్‌రౌండర్‌ అవసరం లేదని అన్నారు. ఇప్పటికే టెస్టుల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడని, అలాగే వరల్డ్‌ నంబర్‌ టూ ఆల్‌రౌండర్‌గా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం టీమిండియాలోనే ఉన్నాడని గుర్తు చేస్తున్నారు. కాగా, వీళ్లిద్దరూ స్పిన్నర్లని, కానీ, టీమిండియాకు పేస్‌ బౌలింగ్‌ వేసే ఆల్‌రౌండర్‌ అవసరం ఉందని, నాసర్‌ చెప్పింది కూడా వాస్తవమే అంటూ మరికొంతమంది క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఇంగ్లండ్‌ గడ్డపై పృథ్వీ షా విధ్వంసం! కొద్దిలో రోహిత్‌ 264 రికార్డ్‌ మిస్‌