iDreamPost
android-app
ios-app

బాధపడకండి.. ఒక్క మ్యాచ్‌ టీమిండియా గౌరవాన్ని తగ్గించలేదు!

  • Published Nov 20, 2023 | 1:00 PM Updated Updated Nov 20, 2023 | 1:00 PM

వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది భారత క్రికెట్‌ అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు. కానీ, నిజమైనా ఛాంపియన్‌ ఇండియానే అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. కానీ, ఇది చదవండి.. మీకే అర్థమవుతుంది.

వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది భారత క్రికెట్‌ అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు. కానీ, నిజమైనా ఛాంపియన్‌ ఇండియానే అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. కానీ, ఇది చదవండి.. మీకే అర్థమవుతుంది.

  • Published Nov 20, 2023 | 1:00 PMUpdated Nov 20, 2023 | 1:00 PM
బాధపడకండి.. ఒక్క మ్యాచ్‌ టీమిండియా గౌరవాన్ని తగ్గించలేదు!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమి భారత క్రికెట్‌ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన జట్టు.. ఓటమి అనేదే ఎరుగకుండా.. ఫైనల్‌ వరకు దూసుకొచ్చింది. ఫైనల్‌లో మన ప్రత్యర్థి ఆస్ట్రేలియాని ఇప్పటికే టోర్నీ ఆరంభంలోనే ఓడించడంతో ఇక ఫైనల్లో కూడా టీమిండియాకు ఎదురు ఉండదని అంతా అనుకున్నారు. కానీ, ఫలితం ఊహించని విధంగా వచ్చింది. భారత క్రికెట్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తూ.. టీమిండియా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం దేశవాప్తంగా క్రికెట్‌ అభిమానుల్లో ఏదో తెలియని ఒక నిరాశ, నిశబ్దం ఆవహించింది. కానీ, ఒక యాంగిల్‌లో చూస్తే.. టీమిండియానే అసలైన వరల్డ్‌ ఛాంపియన్‌. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే.. ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతలా బాధపడాల్సిన పనిలేదు. అదేంటంటే..

ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీని ఐసీసీ కొత్త పద్ధతిలో నిర్వహించింది. గతంలో అన్ని టీమ్స్‌ను గ్రూపులుగా విభజించి, గ్రూప్‌ స్టేజ్‌, సూపర్‌ 8 లేదా సూపర్‌ 6 అంటే పలు దశల్లో పోటీలు నిర్వహించేది. కానీ, ఈ సారి.. వరల్డ్‌ కప్‌ బరిలో ఉన్న ప్రతి టీమ్‌ అన్ని టీమ్స్‌తో కచ్చితంగా ఆడేలా ప్లాన్‌ చేసింది. అలా టీమిండియా మిగిలిన తొమ్మిది జట్లతో కూడా పోటీ పడింది. వరుస బెట్టి అన్ని టీమ్స్‌ను ఓడించింది. సెమీస్‌కు చేరకముందే.. ప్రపంచంలోని టాప్‌ 9 టీమ్స్‌ను రోహిత్‌ సేన మట్టికరిపించింది. ఫైనల్‌లో మనపై నెగ్గిన ఆస్ట్రేలియాను సైతం టోర్నీ ఆరంభంలోనే ఫస్ట్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఓడించింది. అలా ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌లను ఓడించి.. సెమీస్‌కు చేరింది. వాడుక భాషలో అందర్ని ఓడించిన వాడే విజేత. ఈ లెక్కన టీమిండియానే అసలైన విశ్వవిజేత.

మరోవైపు ఆస్ట్రేలియా జట్టును తీసుకుంటే.. టోర్నీ ఆరంభంలోనే మనపైనే కాదు, రెండు మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. కానీ, ఆ తర్వాత పుంజుకుని, మూడో స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఐసీసీ నిర్దేశించిన షడ్యూల్‌ ప్రకారం.. సెమీస్‌, ఫైనల్‌ ఆడి గెలిచిన జట్టుకే కప్పు దక్కుతుంది కాబట్టి.. ఆ రెండు దశల్లో అద్భుతంగా ఆడిన ఆస్ట్రేలియా కప్పు గెలిచింది. నైతికంగా చూసుకుంటే.. మాత్రం టీమిండియానే అసలైన ఛాంపియన్‌. వరల్డ్‌ కప్‌లో టీమిండియా చేతిలో ఓడిపోని జట్టే లేదు. అలాగే టీమిండియా మొత్తం 11 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, ఒక ఓటమి పొందింది. ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 2 ఓటములు పొందింది. కానీ, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గిన ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ ఎగరేసుకుపోయింది. ఏది ఏమైనా.. టోర్నీ ఆసాంతం టీమిండియా అద్భుతంగా ఆడింది. కానీ, ఫైనల్లో దురదృష్టం వెంటాడి టాస్‌ ఓడిపోవడమే మనకు తీవ్ర నష్టం చేసింది. మరి టీమిండియా ఫైనల్లో ఓటమి పాలు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.