Nidhan
తెలుగు రాష్ట్రాలకు మరోమారు బీసీసీఐ నుంచి మొండిచెయ్యి ఎదురైంది. దీంతో ఇంకెన్నాళ్లు ఈ వివక్ష అని అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఇంత దారుణం ఏంటని నిలదీస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు మరోమారు బీసీసీఐ నుంచి మొండిచెయ్యి ఎదురైంది. దీంతో ఇంకెన్నాళ్లు ఈ వివక్ష అని అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఇంత దారుణం ఏంటని నిలదీస్తున్నారు.
Nidhan
ప్రస్తుతం భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌తో బిజీ అయిపోయింది. ఇంకొన్ని రోజులు మెగా టోర్నీతోనే సరిపోతుంది. ఆ తర్వాత కూడా టీమిండియాకు టైట్ షెడ్యూల్ ఉంది. ఒకవైపు పొట్టి కప్పు నడుస్తుండగానే.. మరోవైపు ఇతర సిరీస్‌ల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది భారత క్రికెట్ బోర్డు. వచ్చే ఏడాది కాలం పాటు మన టీమ్ ఆడబోయే సిరీస్‌ల వివరాలను ప్రకటించింది. మూడు దేశాలతో జరిగే 5 సిరీస్‌ల షెడ్యూల్‌తో పాటు స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో కలసి మొత్తంగా ఐదు సిరీస్‌లు ఆడనుంది మెన్ ఇన్ బ్లూ. ఫస్ట్ బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అనంతరం కివీస్‌తో మూడు టెస్టులు, ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌తో బిజీ అయిపోనుంది భారత్.
ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జరిగే మ్యాచ్‌ల వివరాలను తేదీలతో సహా ప్రకటించింది బీసీసీఐ. ఇంతవరకు బాగానే ఉన్నా వేదికల విషయంలో బోర్డు వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలకు బోర్డు అన్యాయం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత జట్టుకు సంబంధించిన 2024-25 హోమ్ సీజన్ షెడ్యూల్ ప్రకారం తెలుగు స్టేట్స్లో ఒకే ఒక మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్‌తో జరిగే ఆఖరి టీ20 మ్యాచ్‌కు హైదరాబాద్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు కనీసం ఒక్క మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిన బోర్డు.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు.
భారత్-బంగ్లా మధ్య జరిగే చివరి టీ20కి ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. కానీ వైజాగ్ వేదికగా ఒక్క మ్యాచ్‌ను కూడా బోర్డు షెడ్యూల్ చేయలేదు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్-2023 టైమ్‌లోనూ తెలుగు రాష్ట్రాల విషయంలో బీసీసీఐ ఇదే వివక్షను కంటిన్యూ చేసింది. హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్ ఆడాల్సిన మ్యాచ్‌లు కేటాయించిన బోర్డు.. విశాఖపట్నానికి ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వలేదు. అయిపోయింది ఏదో అయిపోయింది.. కనీసం ఇప్పుడైనా కరుణిస్తారని అనుకుంటే మళ్లీ మొండిచెయ్యే ఎదురైంది. ముంబై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్ లాంటి వేదికలకు మల్టిపుల్ మ్యాచెస్ ఇచ్చిన బోర్డు.. తెలుగు రాష్ట్రాలకు ఒక్క మ్యాచ్ ఇవ్వాలన్నా మీనమేషాలు లెక్కపెట్టడంపై తెలుగు ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇంత దారుణం ఏంటని ఆగ్రహానికి గురవుతున్నారు. బోర్డు తీరు మార్చుకోవాలని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల అధికారులు బీసీసీఐలో హవా నడిపించేందుకు ప్రయత్నించాలని.. లేకపోతే సిచ్యువేషన్లో మార్పులు రావడం కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. తెలుగు స్టేట్స్ విషయంలో బీసీసీఐ తీరుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
🥁 Announced!
The International Home Season 2024-25 Fixtures are here! 🙌
Which contest are you looking forward to the most 🤔#TeamIndia | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) June 20, 2024