iDreamPost
android-app
ios-app

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో హ్యాట్రిక్‌ కొట్టేందుకు టీమిండియా ఇదే ఛాన్స్‌: వసీం జాఫర్‌

  • Published Aug 11, 2024 | 10:00 PM Updated Updated Aug 11, 2024 | 10:00 PM

Border Gavaskar Trophy, BGT 2024-25, IND vs AUS, Wasim Jaffer: ఓ ప్రతిష్టాత్మక సిరీస్‌లో హ్యాట్రిక్‌ కొట్టేందుకు రోహిత్‌ సేనకు ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ జాఫర్‌ అన్నాడు. మరి ఏ సిరీస్‌ గురించి అన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Border Gavaskar Trophy, BGT 2024-25, IND vs AUS, Wasim Jaffer: ఓ ప్రతిష్టాత్మక సిరీస్‌లో హ్యాట్రిక్‌ కొట్టేందుకు రోహిత్‌ సేనకు ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ జాఫర్‌ అన్నాడు. మరి ఏ సిరీస్‌ గురించి అన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Aug 11, 2024 | 10:00 PMUpdated Aug 11, 2024 | 10:00 PM
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో హ్యాట్రిక్‌ కొట్టేందుకు టీమిండియా ఇదే ఛాన్స్‌: వసీం జాఫర్‌

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 మంచి జోష్‌ మీదున్న టీమిండియా.. ఓ ప్రతిష్టాత్మక టెస్ట్‌ సిరీస్‌ను వరుసగా మూడోసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్‌ కొట్టేందుకు ఇదే సరైన సమయంలో అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ అన్నాడు. ఈ ఏడాది నవంబర్‌ 22 నుంచి 2025 జనవరి 7వ తేదీ వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆసీస్‌తో ఐదు టెస్టుల బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ఆడనుంది. అయితే.. ఈ టెస్ట్‌ సిరీస్‌ను మూడో సారి గెలిచే గోల్డెన్‌ ఛాన్స్‌ ఇదే అంటూ జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. చివరి రెండు సిరీస్‌ల్లోనూ టీమిండియానే 2-1తో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా కండీషన్స్‌లో టీమిండియా స్పీడ్‌ బౌలర్లు.. జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌ ఎంతో ప్రభావం చూపించే అవకాశం ఉందని.. వాళ్లే భారత్‌కు సగం బలం అంటూ పేర్కొన్నాడు. వీరితో పాటు అర్షదీప్‌ సింగ్‌, మయాంక్‌ యాదవ్‌ కూడా ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా మారే ఛాన్స్‌ ఉందని పేర్కొన్నాడు. పైగా జట్టులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి సీనియర్లతో బ్యాటింగ్‌ ఎంతో స్ట్రాంగ్‌గా ఉంది. పైగా కోహ్లీ ఆస్ట్రేలియాలో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది.

ఇక పోతే.. 2025లో జరిగే వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్స్‌ ఫైనల్‌ ఆడాలంటే.. టీమిండియాకు ఆస్ట్రేలియాతో ఆడే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ఎంతో కీలకం కానుంది. ఈ సిరీస్‌లో ఎన్ని ఎక్కువ మ్యాచ్‌లు విజయ​ం సాధిస్తే.. అంత మంచిది బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీతో పాటు.. డబ్ల్యూటీసీ పాయింట్లను కూడా మెరుగుపర్చుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్‌ కంటే ముందు టీమిండియా.. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాతో సిరీస్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తర్వాత.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లు ఆడనుంది భారత జట్టు. మరి టీమిండియాకు వరుసగా మూడోసారి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ గెలిచేందుకు ఇదే మంచి అవకాశం అని వసీం జాఫర్‌ పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.