SNP
IND vs USA, T20 World Cup 2024, Penalty Runs: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
IND vs USA, T20 World Cup 2024, Penalty Runs: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి.. సూపర్ 8కు క్వాలిఫై అయిపోయింది. వరుసగా మూడు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉంది రోహిత్ సేన. బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 16 ఓవర్ ప్రారంభానికి ముందు ఫీల్డ్ అంపైర్ ఒక సిగ్నల్ ఇచ్చాడు. దానికి అర్థం ఏంటి? అని క్రికెట్ అభిమానులు తలగొక్కున్నారు. అమెరికా ఆటగాళ్లకు కూడా అంపైర్ ఇచ్చిన సిగ్నల్‌కు అర్థమేంటో తెలియక తికమకపడ్డారు.
ఇంతకీ అంపైర్ ఆ సిగ్నల్‌కి అర్థమేంటి? ఎందుకు ఆ సిగ్నల్ ఇచ్చాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. యూఎస్‌ఏపై అమెరికా ఛేజింగ్‌కి దిగిన సమయంలో 15వ ఓవర్ ముగిసి.. 16వ ఓవర్ ప్రారంభమయ్యే ముందు అంపైర్ ఓ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సిగ్నల్‌తో టీమిండియా స్కోర్‌కు అదనంగా 5 రన్స్ యాడ్ అయ్యాయి. అంపైర్ ఆ సిగ్నల్ ఎందుకు ఇచ్చిడు? ఇండియాకు ఫ్రీగా 5 రన్స్ ఎందుకు వచ్చాయంటే.. అమెరికా బౌలర్లు.. ఓవర్ స్టార్ట్ చేయడానికి ఉండే నిర్ణీత సమయాన్ని దాటేశారు. ఒక ఓవర్ ముగిసి మరో ఓవర్‌ను మొదలు పెట్టేందుకు 60 సెకన్ల సమయం ఇస్తారు. ఆ టైమ్‌ను దాటితే వార్నింగ్ ఇస్తారు. అలా ఒకే మ్యాచ్‌లో మూడు సార్లు టైమ్ క్రాస్ చేస్తే.. 5 పెనాల్టీ రన్స్ ఇస్తారు. అంటే.. బౌలింగ్ టీమ్ చేసిన తప్పుకు శిక్షగా.. ప్రత్యర్థి జట్టుకు 5 రన్స్ ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇది క్రికెట్‌లో కొత్త రూల్. ఈ రూల్ కారణంగా ఇండియాకు నిన్నటి మ్యాచ్‌లో ఫ్రీగా 5 రన్స్ వచ్చాయన్నమాట. అయితే.. అంపైర్ తన కుడి చేయితో ఎడమ భుజంపై తడితే.. బ్యాటింగ్ టీమ్‌కు 5 పెనాల్టీ రన్స్ ఇవ్వాలని అర్థం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఓపెనర్ స్టీవెన్ టేలర్ 24, ఎన్‌ఆర్ కుమార్ 27 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. హార్ధిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక 111 పరుగుల స్వల్ప టార్గెట్‌ను టీమిండియా 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమైనా.. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే రాణించి విజయం అందించారు. కోహ్లీ 0, రోహిత్ 3 రన్స్ మాత్రమే చేసి నిరాశపర్చారు. పంత్ 18, సూర్య 50, దూబే 31 పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో నేత్రవాల్కర్ 2 వికెట్లతో రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో ఇండియాకు 5 పెనాల్టీ రన్స్ లభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A landmark moment! 😳
As #TeamIndia advanced through to the Super 8, USA were fined 5 penalty runs after the 15th over as the co-hosts took more than a minute between overs three times!
WATCH 🇮🇳 NEXT ➡️ #INDvCAN | SAT, JUN 15, 6 PM | #T20WorldCupOnStar pic.twitter.com/uEax3CIHwN
— Star Sports (@StarSportsIndia) June 12, 2024