Nidhan
Ryan Ten Doeschate On Team India: భారత జట్టుకు నయా అసిస్టెంట్ కోచ్‌గా వచ్చిన ర్యాన్ టెన్ డస్కటే తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క సిరీస్‌తోనే టీమిండియా ఏంటో పూర్తిగా చెప్పేశాడు.
Ryan Ten Doeschate On Team India: భారత జట్టుకు నయా అసిస్టెంట్ కోచ్‌గా వచ్చిన ర్యాన్ టెన్ డస్కటే తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క సిరీస్‌తోనే టీమిండియా ఏంటో పూర్తిగా చెప్పేశాడు.
Nidhan
కోచింగ్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఒక టీమ్ ఎన్విరాన్మెంట్ను అర్థం చేసుకొని అందుకు తగ్గట్లు వ్యూహాలు పన్నాలి. జట్టులోని ఆటగాళ్ల బలాబలాలను సరిగ్గా అంచనా వేయాలి. బలాన్ని మరింత పెంచి, బలహీనతను కూడా బలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుండేలా చూసుకోవాలి. కోర్ గ్రూప్‌గా ఎందులో బాగా సక్సెస్ అవుతున్నారో అర్థం చేసుకోకపోతే టీమ్ కోసం స్ట్రాటజీలు సిద్ధం చేయడం చాలా కష్టం. ఈ కిటుకు తెలుసుకున్నట్లున్నాడు టీమిండియా నయా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే. భారత కోచింగ్ బృందంలో చేరి నెల రోజులు కూడా తిరగకముందే టీమిండియాను పూర్తిగా చదివేశాడు.
భారత జట్టు బలం స్పిన్‌ను బాగా ఆడటం. పేస్ బౌలింగ్‌ను కూడా అంతే ధీటుగా ఎదుర్కోగలరు మన బ్యాటర్లు. కానీ స్పిన్‌ను బాగా ఆడటం, స్పిన్ బౌలర్లను చిత్తు చేయడం భారత బ్యాటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇందులో ఏళ్లుగా మనోళ్లు ఆరితేరారు. ఇదే విషయాన్ని బాగా అర్థం చేసుకున్న డస్కటే.. లంకతో వన్డే సిరీస్‌లో ఓటమికి కారణం ఏంటో చెప్పేశాడు. స్పిన్‌ను బాగా ఆడే టీమిండియా క్రికెటర్లు.. ఈసారి అందులో కాస్త వెనుకంజ వేశారని, అందుకే ఓటమి తప్పలేదన్నాడు. శ్రీలంక సిరీస్‌లో టీ20ల్లో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ.. వన్డే సిరీస్‌లో మాత్రం సేమ్ రిజల్ట్‌ను రిపీట్ చేయలేకపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి స్టార్లు ఉన్నా జట్టును ఓటముల నుంచి కాపాడలేకపోయారు.
లంక సిరీస్ ఓటమిపై నయా అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమి తమను బాధకు గురిచేసిందన్నాడు. ‘శ్రీలంక టూర్‌ను సక్సెస్‌తో ముగించలేకపోయాం. ఓవర్సీస్లో రాణించాలని భారత క్రికెటర్లు పట్టుదలతో ఉన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో అదరగొట్టాలని వాళ్లు కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ఫోకస్ పెడుతున్నారు. భారత జట్టు స్పిన్‌ను ఆడటంలో ఆరితేరింది. ఇది టీమిండియాకు ఎప్పుడూ బలంగా ఉంటూ వచ్చింది. కానీ లంక సిరీస్‌లో మాత్రం ఇది జరగలేదు. మా బ్యాటర్లు కాస్త తడబడ్డారు’ అని టెన్ డస్కటే చెప్పుకొచ్చాడు. ఇక, లంకతో వన్డే సిరీస్‌లో భారత్ 0-2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్ డ్రా కాగా.. మరుసటి రెండు మ్యాచుల్లో ఆతిథ్య జట్టు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. లంక మీద చాన్నాళ్ల తర్వాత టీమిండియా సిరీస్ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంది. పొట్టి వరల్డ్ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన టీమ్.. లంక చేతుల్లో ఓడిపోవడం అభిమానుల్ని నిరాశపర్చింది.
Ryan Ten Doeschate said – “We were undone in SL & I think mindset of Indians has been such that they are so driven to do well overseas & focus has moved to doing well in AUS & ENG, we’ve kind of let playing spin, which was always strength of Indian team, fall back a little bit”. pic.twitter.com/apre7A5N9h
— Tanuj Singh (@ImTanujSingh) August 21, 2024