iDreamPost
android-app
ios-app

IND vs ENG: బ్యాటర్లకు తిప్పలే.. ఒకే గేమ్‌ ప్లాన్‌తో బరిలోకి ఇండియా-ఇంగ్లాండ్‌!

  • Published Jan 31, 2024 | 1:10 PM Updated Updated Jan 31, 2024 | 1:10 PM

విశాఖ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ కోసం ఇండియా-ఇంగ్లాండ్ జట్లు మాస్టర్ ప్లాన్స్ తో బరిలోకి దిగుతున్నాయి. అయితే ఒకే గేమ్ ప్లాన్ తో ఇరు జట్లు గ్రౌండ్ లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.

విశాఖ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ కోసం ఇండియా-ఇంగ్లాండ్ జట్లు మాస్టర్ ప్లాన్స్ తో బరిలోకి దిగుతున్నాయి. అయితే ఒకే గేమ్ ప్లాన్ తో ఇరు జట్లు గ్రౌండ్ లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.

IND vs ENG: బ్యాటర్లకు తిప్పలే.. ఒకే గేమ్‌ ప్లాన్‌తో బరిలోకి ఇండియా-ఇంగ్లాండ్‌!

ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం భారత గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ ఘనంగా బోణీ కొట్టింది. ఉత్కంఠగా సాగిన తొలి మ్యాచ్ లో 28 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా ఓటమిని చవిచూసింది. దీంతో సిరీస్ లో 1-0తో వెనకబడింది. ఇక ఫిబ్రవరి 2వ తారీఖున విశాఖ వేదిగా జరిగే రెండో టెస్ట్ లో విజయం సాధించి.. సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది భారత జట్టు. అటు ఇంగ్లాండ్ సైతం తొలి విజయం ఇచ్చిన ఊపును కొనసాగించి.. రెండో టెస్ట్ ను కూడా గెలవాలని ఆరాటపడుతోంది. కాగా.. ఇందుకోసం ఇరు జట్లు మాస్టర్ ప్లాన్స్ తో బరిలోకి దిగుతున్నాయి. అయితే ఒకే గేమ్ ప్లాన్ తో ఇరు జట్లు గ్రౌండ్ లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్స్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బజ్ బాల్ విధానంతో టెస్ట్ క్రికెట్ లో సంచలన విజయాలు నమోదు చేసిన ఇంగ్లాండ్.. అదే స్ట్రాటజీతో భారత్ ను తొలి టెస్ట్ లో ఓడించింది. అయితే ఇప్పుడు రెండో టెస్ట్ లో ప్రత్యర్థిని ఓడించాలంటే టీమిండియా ముందు రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి బజ్ బాల్ స్ట్రాటజీకి ఎలా కౌంటర్ వేయాలి? రెండు.. ఇంగ్లాండ్ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొవాలి? తొలి మ్యాచ్ లో డెబ్యూ స్పిన్నర్ టామ్ హార్ట్లీ సంచలన ప్రదర్శన గురించి తెలిసిందే. 7 వికెట్లు తీసి టీమిండియాకు విజయాన్ని దూరం చేశాడీ కుర్ర స్పిన్నర్. ప్రపంచ క్రికెట్ లోనే స్పిన్ ఎదుర్కొవడంలో మేటి ఆటగాళ్లుగా టీమిండియా ప్లేయర్లు ఘనత వహించారు. అలాంటి వారినే తన స్పిన్ తో బోల్తా కొట్టించాడు హార్ట్లీ. ఇక ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఫిబ్రవరి 2న ప్రారంభం కానున్న రెండో టెస్ట్ కోసం ఇరు జట్లు ఒకే గేమ్ ప్లాన్ ను అమలు చేయబోతున్నట్లు కనిపిస్తోంది.

విశాఖ వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం ఇటు ఇండియా, అటు ఇంగ్లాండ్ జట్లు నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అన్న కారణంతో రెండు టీమ్స్ తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే టీమిండియా సైతం తన మాస్టర్ ప్లాన్ గీస్తోంది. తొలి మ్యాచ్ లో దారుణంగా విఫలం అయ్యిన పేసర్ మహ్మద్ సిరాజ్ ను పక్కన పెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ లతో పాటుగా వాషింగ్టన్ సుందర్, మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ లను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. ఇదే జరిగితే పేసర్ గా బుమ్రా ఒక్కడే తుది జట్టులో ఉంటాడు. మరోవైపు కొత్తగా జట్టులోకి వచ్చిన దేశవాళీ ఆల్ రౌండర్ సౌరభ్ తివారి సైతం టీమ్ లోకి వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. మరోవైపు ఇంగ్లాండ్ సైతం ఇదే ప్లాన్ ను అమలు చేయాలని భావిస్తోంది. తాము కూడా ఈ మ్యాచ్ కోసం ఏకంగా మెుత్తం స్పిన్నర్లతో బరిలోకి దిగడానికి భయపడమని ఇప్పటికే ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత మ్యాచ్ లో ఉన్న ఏకైక పేసర్ మార్క్ఉడ్ సైతం సిరాజ్ లా దారుణంగా విఫలం అయ్యాడు. దాంతో నలుగు స్పిన్నర్లతోనే ఇంగ్లీష్ టీమ్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జో రూట్, జాక్ లీజ్, టామ్ హార్ట్లీతో పాటుగా రెహన్ అహ్మద్ స్పిన్ విభాగానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే రెండు జట్లు కూడా స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుండటంతో.. బ్యాటర్లకు తిప్పలు తప్పేలా లేవు. విశాఖ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే.. ఇరు జట్ల బ్యాటర్లకు కష్టాలు తప్పవని క్రీడా పండితులు చెప్పుకొస్తున్నారు. మరి రెండు జట్లు కూడా స్పిన్ మంత్రాన్నే జపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.