iDreamPost
android-app
ios-app

IND vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా! 2-0తో లీడ్‌లోకి..

  • Published Jan 30, 2024 | 4:56 PM Updated Updated Jan 30, 2024 | 4:56 PM

India vs England: ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌.. తొలి మ్యాచ్‌లో గెలిచింది. కానీ, మరోవైపు ఇంకో టీమిండియా.. ఇంగ్లండ్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

India vs England: ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌.. తొలి మ్యాచ్‌లో గెలిచింది. కానీ, మరోవైపు ఇంకో టీమిండియా.. ఇంగ్లండ్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 30, 2024 | 4:56 PMUpdated Jan 30, 2024 | 4:56 PM
IND vs ENG: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా! 2-0తో లీడ్‌లోకి..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఇటీవల ఇండియా-ఇంగ్లండ్‌ జట్లు తొలి టెస్టులో తలపడిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది. తొలి మ్యాచ్‌లో ఆరంభం నుంచి టీమిండియానే ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయించింది. టాస్‌ గెలిచి తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టి.. కేవలం 246 పరుగులకే ఆలౌట్‌ చేశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు దిగి 436 పరుగుల మంచి స్కోర్‌ చేసి.. 190 రన్స్‌ లీడ్‌ వచ్చిన తర్వాత టీమిండియానే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా టీమిండియా తొలి టెస్టులో ఓటమి పాలైంది.

ఇలా ఒక వైపు మెన్స్‌ క్రికెట్‌లో ఇండియాను ఇంగ్లండ్‌ ఓడిస్తే.. మరోవైపు డిసైబుల్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ను ఇండియా రెండు వరుస మ్యాచ్‌ల్లో చిత్తు చేసింది. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌ డిసైబుల్‌ జట్టుతో ఇండియా డిసైబుల్‌ జట్టు టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటికే జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఇండియా డిసైబుల్‌ జట్టు ఘన విజయం సాధించింది. ఈ నెల 28న జరిగిన తొలి మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను కేవలం 97 పరుగులకే ఆలౌట్‌ చేసి.. విజయం సాధించింది. ఇక మంగళవారం జరిగిన రెండో టీ20లో కూడా టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ టీమ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లోనూ ఇండియానే తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ జఫ్పార్‌ భట్‌ 51, కెప్టెన్‌ విక్రాంత్‌ 52 పరుగులతో రాణించారు. ఇక 178 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 142 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. ఇలా రెండు వరుస టీ20ల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.