iDreamPost

పాకిస్థాన్​పై భారత్ గ్రాండ్ విక్టరీ.. సెమీస్​కు దూసుకెళ్లిన ఇండియా!

  • Author singhj Published - 09:26 PM, Wed - 19 July 23
  • Author singhj Published - 09:26 PM, Wed - 19 July 23
పాకిస్థాన్​పై భారత్ గ్రాండ్ విక్టరీ.. సెమీస్​కు దూసుకెళ్లిన ఇండియా!

క్రికెట్​లో కొన్ని పోరాటాలు చూసేందుకు ఫ్యాన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. కొన్ని జట్లు తలపడితే చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి పోరాటాలకు ప్రసిద్ధిగా భారత్, పాకిస్థాన్​లను చెప్పొచ్చు. ఈ రెండు టీమ్స్ గ్రౌండ్​లో తలపడుతున్నాయంటే చాలు.. చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి. గెలుపు కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడటం, ఓటమిని ఒప్పుకోకపోవడం, చివరి ఓవర్ వరకు మ్యాచ్​ వెళ్లడం హైలైట్ అనే చెప్పాలి. అందుకే భారత్, పాక్ మ్యాచ్​లకు అంత డిమాండ్. అలాంటి ఈ రెండు టీమ్స్ మధ్య ఇవాళ ఒక మ్యాచ్ జరిగింది. అయితే ఇది సీనియర్ జట్ల నడుమ జరిగిన మ్యాచ్ కాదు.

ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ కప్​ (వన్డే)లో భాగంగా భారత్-ఏతో పాకిస్థాన్​-ఏ టీమ్ తలపడింది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన పాక్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే 10 రన్స్ కూడా దాటకుండానే ఆ టీమ్ రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కొంచెం కుదురుకున్నట్లు కనిపించింది. కానీ భారత బౌలర్లు వరుస వికెట్లతో ఎక్కడా పాక్ జోరు పెరగకుండా బ్రేకులు వేశారు. దీంతో దాయాది టీమ్ 48 ఓవర్లలో 205 రన్స్ మాత్రమే చేయగలిగింది. పాక్ బ్యాట్స్​మెన్​లో ఖాసిమ్ అక్రమ్ (48)ది అత్యధిక స్కోరు కావడం గమనార్హం. షాహిబ్​జాదా ఫర్హాన్ (35), హషీబుల్లా ఖాన్ (27) రాణించారు.

వీళ్లతో పాటు ముబసిరర్ ఖాన్ (28), మెహ్రన్ ముంతాజ్ (25) కూడా రాణించడంతో పాకిస్థాన్ కనీసం ఆ స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో రాజవర్దన్ హంగర్లేకర్ ఐదు, మానవ్ సుతార్ మూడు వికెట్లతో సత్తా చాటారు. రియాన్ పరాగ్, నిషాంద్ సంధు చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్​.. సాయి సుదర్శన్ (104) సెంచరీతో అలవోకగా విజయం సాధించింది. సుదర్శన్​కు నికిన్ జోస్ (53) మంచి సహకారం అందించాడు. సెంచరీకి ముందు సాయి సుదర్శన్ వరుస సిక్సులతో పాక్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ విక్టరీతో టోర్నీలో సెమీఫైనల్స్​కు భారత్ అర్హత సాధించింది. సెమీస్​లో బంగ్లాదేశ్​తో తలపడనున్న బారత్.. ఇప్పటివరకు ఓటమి అనేదే లేకుండా దూసుకుపోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి