iDreamPost
android-app
ios-app

వీడియో: సెంచరీ చేసి.. అయోధ్య రాముడికి అంకితమిచ్చిన తెలుగు క్రికెటర్‌!

  • Published Jan 21, 2024 | 2:15 PM Updated Updated Jan 22, 2024 | 4:06 PM

ఒక టీమిండియా క్రికెటర్ సెంచరీ బాదాడు. అయితే శతకం తర్వాత అందరిలా కాకుండా వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్​ను శ్రీరాముడికి అంకితం చేశాడు.

ఒక టీమిండియా క్రికెటర్ సెంచరీ బాదాడు. అయితే శతకం తర్వాత అందరిలా కాకుండా వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్​ను శ్రీరాముడికి అంకితం చేశాడు.

  • Published Jan 21, 2024 | 2:15 PMUpdated Jan 22, 2024 | 4:06 PM
వీడియో: సెంచరీ చేసి.. అయోధ్య రాముడికి అంకితమిచ్చిన తెలుగు క్రికెటర్‌!

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా భవ్య రామ మందిరం గురించే మాట్లాడుకుంటున్నారు. శ్రీరాముడి భక్తులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. సోమవారం జరగనున్న ప్రాణప్రతిష్ట వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి 8 వేల మందిని అతిథులుగా ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. అందులో 506 మందిని వీఐపీలుగా సెలక్ట్ చేశారు. మరికొన్ని గంటల్లో మందిరంలో బాలరాముడు కొలువుదీరనుండటంతో అందరూ దీనిపై ఫోకస్ చేస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు రామ మందిరం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఓ టీమిండియా క్రికెటర్ సెంచరీని శ్రీరాముడికి అంకితం చేశాడు.

భారత వికెట్ కీపర్‌‌, తెలుగు తేజం కేఎస్ భరత్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ లయన్స్​తో జరుగుతున్న టెస్ట్​లో రెండో ఇన్నింగ్స్​లో 116 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. 165 బంతుల్లో 116 పరుగులు చేసిన భరత్.. 15 బౌండరీలు బాదాడు. అయితే సెంచరీ తర్వాత వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్​, చేతుల్ని పైకి ఎత్తాడు. ఆ తర్వాత ఎడమ చేతితో బ్యాట్​ను పట్టుకొని.. కుడి చేతితో రాముడిలా బాణం వేశాడు. తన ఇన్నింగ్స్​ను శ్రీరాముడికి అంకితం చేశాడు. భరత్ సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఇంగ్లండ్ లయన్స్ టీమ్ సభ్యులు అతడ్ని చప్పట్లతో అభినందించారు. భరత్ సెలబ్రేషన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు.. టీమిండియా క్రికెటర్​ను అభినందిస్తున్నారు. బోలో జై శ్రీరామ్ అంటూ నినదిస్తున్నారు. అదే టైమ్​లో విరాట్ కోహ్లీ ఫొటోలను కూడా షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇటీవల సౌతాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టుల్లో ఆడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్​లో సఫారీ బ్యాటర్ కేశవ్ మహారాజ్ బ్యాటింగ్​కు వస్తున్నప్పుడు డీజే ఓ సాంగ్ ప్లే చేశాడు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీలోని ‘జై శ్రీరామ్’ పాట పెట్టాడు. దీంతో గ్రౌండ్​లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ రెండు చేతులు జోడించాడు. ఆ తర్వాత రాముడిలా బాణం సంధించాడు. అప్పట్లో ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇప్పుడు భరత్ కూడా అలాగే పోజ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కోహ్లీ ఫొటోలను కూడా షేర్ చేస్తున్నారు. భారత క్రికెటర్లకు శ్రీరాముడు అంటే అపార భక్తి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఇంగ్లండ్​తో జరిగే టెస్ట్ సిరీస్​లోని తొలి రెండు మ్యాచులకు భరత్ సెలక్ట్ అయ్యాడు. కేఎల్ రాహుల్​ను స్పెషలిస్ట్ బ్యాటర్​గా ఆడిస్తే భరత్​ను కీపర్​గా తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్ లయన్స్​పై సెంచరీ బాదాడు కాబట్టి అతడ్ని తీసుకోవడం ఖాయమని అనలిస్టులు అంటున్నారు. మరి.. ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో భరత్​ను ఫైనల్ ఎలెవన్​లోకి తీసుకుంటారని భావిస్తే కామెంట్ చేయండి.