T20 World Cup: తొలి మ్యాచ్‌లోనే పాక్‌ చిత్తుగా ఓడేందుకు ఇండియానే కారణమా! ఎలాగంటే?

PAK vs USA, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో సంచలనం నమోదైంది. అసోసియేట్‌ టీమ్‌గా ఉన్న అమెరికా.. మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌ను మట్టి కరిపించింది. అయితే.. అమెరికా గెలుపు వెనుక ఇండియా ఉందని అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

PAK vs USA, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో సంచలనం నమోదైంది. అసోసియేట్‌ టీమ్‌గా ఉన్న అమెరికా.. మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌ను మట్టి కరిపించింది. అయితే.. అమెరికా గెలుపు వెనుక ఇండియా ఉందని అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా గురువారం డల్లాస్‌ వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓటమి పాలైంది. తొలుత ఈ మ్యాచ్‌ టై కాగా.. అంపైర్లు సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు.. సూపర్‌ ఓవర్‌లో సూపర్‌గా ఆడిన అమెరికా.. పాకిస్థాన్‌ను ఓడించి.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి సంచలనం సృష్టించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించడానికి ఇండియా కూడా కారణం అంటూ సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అదేంటి.. జూన్‌ 9న కదా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌. మరి ఈ మ్యాచ్‌తో ఇండియాకి ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారా? సంబంధం ఉంది.. ఎలా అంటే.. ప్రస్తుతం అమెరికా టీమ్‌లో ఉన్న చాలా మంది ఆటగాళ్లు భారత మూలాలు ఉన్న క్రికెటర్లే. ఒకరిద్దరైతే ఏకంగా ఇండియాలో దేశవాళి క్రికెట్‌ ఆడిన వాళ్లు ఉన్నారు. ఇలా భారత మూలాలు ఉన్న ఆటగాళ్లు ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాకిస్థాన్‌ను ఓడించి కొత్త చరిత్ర సృష్టించారు.

160 పరుగుల ఛేజ్‌లో హాఫ్‌ సెంచరీ చేసి అదరగొట్టిన అమెరికా కెప్టెన్‌ మోనాక్‌ పటేల్‌ ఇండియాకు చెందిన వాడే. గుజరాత్‌లో పుట్టాడు. అలాగే నితీష్‌ కుమార్‌, హర్మీత్‌ సింగ్‌, జస్దీప్‌ సింగ్‌, సౌరభ్ నేత్రవల్కర్‌ ఇలా సగం జట్టుకు ఇండియాతో సంబంధం ఉంది. ఇలా ఒక మినీ టీమిండియా పాకి​స్థాన్‌ను వరల్డ్‌ కప్‌ వేదికపై ఓడించింది అంటూ కొంతమంది క్రికెట్‌ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ వికెట్లు పడటంతో వికెట్‌ కాపాడుకుంటూ నిదానంగా ఆడాడు. 43 బంతుల్లో 44 పరుగులు చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

కానీ, మిగతా బ్యాటర్లు ఎవరూ బాబర్‌కు సహకరించలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన ఉస్మాన్‌ ఖాన్‌ 3, ఫకర్‌ జమాన్‌ 11 పరుగులు చేసి నిరావపర్చారు. షదాబ్‌ ఖాన్‌ 40 పరుగులతో రాణించినా.. అతనికి కూడా సహకారం లభించలేదు. ఆజమ్‌ ఖాన్‌ 0, ఇఫ్తికార్‌ అహ్మెద్‌ 18 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. వీరి కంటే.. షాహీన్‌ అఫ్రిదీ బెటర్‌గా బ్యాటింగ్‌ చేశాడు. 16 బంతుల్లో 23 పరుగులు చేసి రాణించాడు. యూఎస్‌ఏ బౌలర్లలో నోస్తుష్ కెంజిగే 3 వికెట్లతో పాక్‌ నడ్డి విరిచాడు. అలాగే సౌరభ్ నేత్రవల్కర్ 2 వికెట్లు సాధించాడు. ఇక 160 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన యూఎస్‌ఏ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 రన్స్‌ చేయడంతో మ్యాచ్‌ టై అయింది. సూపర్‌ ఓవర్‌లో అమెరికా 17 పరుగులు చేసింది. పాక్‌ సూపర్‌ ఓవర్‌లో 18 పరుగులు చేయలేక మ్యాచ్‌ ఓడిపోయి.. ఘోర పరాజయం చవిచూసింది. మరి ఈ మ్యాచ్‌లో గెలిచిన అమెరికా టీమ్‌లో సగం మంది ఇండియాకు చెందిన వారే ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments