iDreamPost
android-app
ios-app

కాసేపట్లో రెండో వన్డే.. శ్రీలంకకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

IND vs SL Second ODI- Sri Lankan Star Player Ruled Out Of The Series: మరికాసేపట్లో టీమిండియా- శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో లంక జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టులో ఉన్న కీలక ప్లేయర్ సిరీస్ కి దూరమయ్యాడు.

IND vs SL Second ODI- Sri Lankan Star Player Ruled Out Of The Series: మరికాసేపట్లో టీమిండియా- శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో లంక జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టులో ఉన్న కీలక ప్లేయర్ సిరీస్ కి దూరమయ్యాడు.

కాసేపట్లో రెండో వన్డే.. శ్రీలంకకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 3 టీ20 మ్యాచుల సిరీస్ ను వైట్ వాష్ చేసింది టీమిండియా. ఇప్పుడు 3 వన్డేల సిరీస్ నడుస్తోంది. అయితే తొలి వన్డేలో మ్యాచ్ ఫలితం టైగా ముగిసింది. ఇప్పుడు ఇరు జట్లు రెండో వన్డేపై కన్నేశాయి. ఎలాగైనా ఈ మ్యాచ్ ని గెలవాలి అని రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. దానికి తగిన ప్రణాళికలు కూడా రచిస్తున్నాయి. అయితే గెలుపు కోసం తహతహలాడుతున్న ఆతిథ్య శ్రీలంక జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ఉందనగా.. ఆ టీమ్ కు చెందిన స్టార్ ప్లేయర్ జట్టుకు దూరం అయ్యాడు. రెండో వన్డేనే కాదు.. మూడో వన్డేకి కూడా అతను అందుబాటులో ఉండడు అని శ్రీలంక బోర్డు అధికారికంగా వెల్లడించింది.

కొలంబో వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇరు జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ప్రస్తుతం టీమిండియా- శ్రీలంక ఇరు జట్లు రెండో వన్డోలే విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. కానీ, రెండో వన్డే శ్రీలంకకు అంత ఈజీగా ఉండేలా లేదు. ఎందుకంటే ఆ టీమ్ కి చెందిన స్టార్ ప్లేయర్ మిగిలిన రెండు వన్డే మ్యాచులకు దూరం అయ్యాడు. అతను మరెవరో కాదు.. వానిందు హసరంగా. తొడ కండరాల గాయం కారణంగా హసరంగా ఈ సిరీస్ లో కొనసాగలేకపోతున్నాడు అంటూ లంక బోర్డు ప్రకటించింది. వన్డే మ్యాచులకు సంబంధించి ఇది శ్రీలంకకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ టూర్ లో హసరంగా చాలా కీలకంగా వ్యవహరించాడు.

ఈ సిరీస్ లో వానిందు హసరంగా శ్రీలంక తరఫున చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. తొలుత జరిగిన మూడు టీ20ల్లో ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే తొలి వన్డే టైగా ముగియడంలో కూడా హసరంగ కీలక పార్త పోషించాడు. 10 ఓవర్లు వేసిన హసరంగా కేవలం 58 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే 3 వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ వికెట్లను తీసింది హసరంగే. వారి ముగ్గురిలో ఏ ఒక్కరు క్రీజులో కాసేపు ఉన్నా కూడా టీమిండియా కచ్చితంగా విజయం సాధించి ఉండేది. కానీ, హసరంగా ఆ అవకాశం లేకుండా చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇప్పుడు హసరంగను దూరం చేసుకోవడం జట్టుకు తీరని దెబ్బ అంటూ లంక ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. మరి.. రెడో వన్డేలో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అని ఫ్యాన్స్ కూడా కాస్త కంగారుగా ఉన్నారు. కానీ, విజయం సాధిస్తుంది అనే నమ్మకం అయితే వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Cricbuzz (@cricbuzzofficial)