iDreamPost
android-app
ios-app

KL Rahul: అభిమానుల మనసు గెలుచుకున్న KL రాహుల్! వీడియో వైరల్..

  • Published Dec 28, 2023 | 10:32 AM Updated Updated Dec 29, 2023 | 12:43 PM

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో సెంచరీ చేసి, అందరి ప్రశంసలు పొందుతున్న కేఎల్ రాహుల్.. తాజాగా మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో సెంచరీ చేసి, అందరి ప్రశంసలు పొందుతున్న కేఎల్ రాహుల్.. తాజాగా మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

KL Rahul: అభిమానుల మనసు గెలుచుకున్న KL రాహుల్! వీడియో వైరల్..

కేఎల్ రాహుల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత బ్యాటర్లందరూ మూకుమ్మడిగా విఫలమైన చోట అద్భుత శతకంతో చెలరేగాడు రాహుల్. దీంతో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. కాగా.. సెంచరీతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న అతడు.. తాజాగా తన నిజయితీతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. సెంచూరియన్ వేదిగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరేగిన రాహుల్.. వికెట్ కీపింగ్ లోనూ సత్తాచాటుతున్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ తన క్రీడా స్ఫూర్తిని చాటుకుని అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఏం జరిగిందంటే? సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 45వ ఓవర్ వేయడానికి వచ్చాడు శార్దూల్ ఠాకూర్. ఈ ఓవర్లో రెండో బంతి సఫారీ బ్యాట్స్ మెన్ డేవిడ్ బెడింగ్ హమ్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి కీపర్ రాహుల్ చేతుల్లో పడింది. దీంతో వెంటనే అప్పీల్ చేసి.. వెంటనే థర్డ్ అంపైర్ సమీక్ష కోరాలని ఫీల్డ్ అంపైర్ కు సైగ చేశాడు. బాల్ తన చేతిలో పడేటప్పుడు గ్రౌండ్ కు తాకిందని రాహుల్ అనుమానం.

kl rahul great heart

ఈ క్రమంలోనే క్యాచ్ పై క్లారిటీ లేకపోవడంతోనే థర్డ్ అంపైర్ కు రిఫర్ చేయాలని ఫీల్డ్ అంపైర్ కు రాహుల్ సైగ చేశాడు. రాహుల్ సూచనలతో అంపైర్ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి కీపర్ చేతిలో పడే ముందే గ్రౌండ్ ను తాకినట్లు తేలింది. దాంతో సఫారీ బ్యాటర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాహుల్ నిజయితీ కారణంగానే అతడికి లైఫ్ లభించిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. రాహుల్ క్రీడా స్ఫూర్తిని మెచ్చుకుంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఇటీవలే యంగ్ క్రికెట్ ఫ్యాన్ కు తన ప్యాడ్స్ గిఫ్ట్ గా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్న రాహుల్.. మరోసారి అభిమానుల మనసు దోచుకున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆటముగిసే సమయానికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి, 11 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. డీన్ ఎల్గర్ భారీ సెంచరీతో చెలరేగాడు. అతడు 211 బంతుల్లో 23 ఫోర్లతో 140 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడు డేవిడ్ బెడింగ్ హమ్ 56 రన్స్ తో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 101 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. మరి కేఎల్ రాహుల్ చూపించిన క్రీడా స్ఫూర్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.