iDreamPost
android-app
ios-app

మ్యాచ్ రద్దు కావడంతో ఏ టీమ్ సేఫ్ అయ్యిందో తెలుసా?

మ్యాచ్ రద్దు కావడంతో ఏ టీమ్ సేఫ్ అయ్యిందో తెలుసా?

ఆసియా కప్ లో శుభారంభం చేద్దామనుకున్న టీమిండియాకి నిరాశే ఎదురైంది. దాయాదుల పోరు కోసం ఎంతగానో ఎదురుచూసిన ప్రేక్షకులు, క్రికెట్ అభిమానుల ఒకింత నిరాశ చెందారు. టీమిండియా బ్యాటింగ్ చూశామని సంతోషించినా కూడా.. మ్యాచ్ రిజల్ట్ రాలేదని బాధతో వెనుదిరిగారు. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. మ్యాచ్ అన్నాక ఒకరు విజయం సాధించాల్సిందే. రద్దు కావడం వల్ల ఒక జట్టుకు అయితే లాభం జరిగిందనే చెప్పాలి. అసలు ఈ మ్యాచ్ ఆగిపోవడం ఏ జట్టుకు మంచిది? మ్యాచ్ ఆగిపోవడం వల్ల ఏ జట్టుకు లాభం జరిగిందో తెలుసా?

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి నుంచి తడబడుతూనే ఉంది. టాపార్డర్ మొత్తం పేకమేడల్లా కూలిపోయింది. పాకిస్తాన్ బౌలర్ల దాటికి టీమిండియా బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అతి తక్కువ స్కోరుకే ఔట్ కావడం జట్టుకు తీవ్ర నష్టం చేసంది. అలాంటి సమయంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా క్రీజులో నిలబడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీళ్లిద్దరూ సునాయాసంగా పాక్ బౌలర్లను ఎదుర్కొన్నారు. అయితే మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వర్షం వస్తూ పోతూనే ఉంది. ప్రతిసారి పిచ్ స్వభావం మారుతూనే ఉంది. ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల పాకిస్తాన్ కే మంచి జరిగిందని చెప్పాలి.

ఎందుకు పాకిస్తాన్ కు మంచి జరిగింది అంటే.. భారత్ నిర్దేశించిన స్కోరు అంత తక్కువేం కాదు. 267 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. ఒకవేళ వర్షం వల్ల ఓవర్స్ తగ్గించినా కూడా..  20 ఓవర్లకు 155, 30 ఓవర్లకు 203, 40 ఓవర్లకు 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేది. ఈ మ్యాచ్ లో పిచ్ చాలా అన్ ప్రెడిక్ట్ బుల్ గా ఉంది. మ్యాచ్ జరిగి ఉంటే.. పాక్ కచ్చితంగా ఇబ్బంది పడేది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ జట్టుకే మంచి జరిగింది. ఒకవేళ మ్యాచ్ నిర్వహించి ఉంటే భారత్ కు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి. ఇలా జరగడం వల్ల పాకిస్తాన్ 1 పాయింట్ వచ్చింది. భారత్ కు రావాల్సిన విజయం చేజారింది.

మ్యాచ్ సమురీ చూస్తే.. టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ బౌలర్లు మొదటి నుంచి ఎంతో ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా(87), ఇషాన్(82) కిషన్ కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించారు. వీళ్లిద్దరు పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇంక బౌలింగ్ విషయానికి వస్తే.. ముఖ్యంగా షాహీన్ అఫ్రీదీ 10 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి.. కేవలం 35 పరుగులే ఇచ్చాడు. రెండు ఓవర్లు మెయిడిన్ కూడా చేశాడు. తర్వాత నసీమ్ షా, రౌఫ్ ఇద్దరూ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. మొత్తం ముగ్గురు బౌలర్లు కలిసి టీమిండియాని ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్ లో హార్దిక్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ తర్వాత తప్పకుండా చెప్పుకోవాల్సింది బుమ్రా బ్యాటింగ్ గురించే. అప్పటి వరకు అన్ వికెట్లు పడుతున్నా కూడా పాక్ బౌలర్లను బుమ్రా పరుగులు పెట్టించాడు. బాల్ తో సత్తా చాటే అవకాశం దక్కకపోయినా బ్యాటింగ్ తోనే ప్రేక్షకులను అలరించాడు. 14 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో బుమ్రా 16 పరుగులు చేశాడు. రౌఫ్, నసీమ్ షా, షాహీన్ అఫ్రీదిలను కూడా కాసేపు కంగారు పెట్టేశాడు.