iDreamPost
android-app
ios-app

మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన గిల్.. ఎందుకంటే?

వరల్డ్ కప్ 2023 తొలి సెమీ ఫైనల్లో కివీస్ పై టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. శుభ్ మన్ గిల్ శతకం దిశగా పరుగులు తీశాడు. కానీ, ఒక్కసారిగా క్రీజుని వదిలి వెళ్లిపోయాడు.

వరల్డ్ కప్ 2023 తొలి సెమీ ఫైనల్లో కివీస్ పై టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. శుభ్ మన్ గిల్ శతకం దిశగా పరుగులు తీశాడు. కానీ, ఒక్కసారిగా క్రీజుని వదిలి వెళ్లిపోయాడు.

మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన గిల్.. ఎందుకంటే?

వరల్డ్ కప్ 2023లో టీమిడింయా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. న్యూజిలాండ్ తో సెమీఫైనల్ కి ముందు టీమిండియా అభిమానుల్లో ఒక రకమైన భయం ఉండేది. అందరికీ 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఫలితమే గుర్తొచ్చేది. ఎక్కడ అలాంటి ఒక రిజల్ట్ మళ్లీ రిపీట్ అవుతుందో అంటూ అంతా భయపడ్డారు. కానీ, ఇప్పుడు టీమిండియా ప్రదర్శన చూసి అంతా ఆనందంలో మునిగిపోయారు. బౌలింగ్, ఫీల్డింగ్ ఎక్కడా కూడా న్యూజిలాండ్ ప్రభావం చూపలేకపోతోంది. గిల్ అయితే శతకం దిశగా వేగంగా దూసుకుపోయాడు. కానీ, ఒక్కసారిగా క్రీజుని వదిలి పెవిలియన్ కు చేరాడు. అలా ఎందుకు జరిగిందని చాలా మందికి అర్థం కాలేదు.

టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లపై మన బ్యాట్స్ మన్లు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ స్కోరు కార్డుని పరుగులు పెట్టించాడు. 47 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. అప్పటి వరకు స్లోగా ఆడిన గిల్ ఆ తర్వాత టాప్ గేర్ వేశాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాడు. కోహ్లీ కూడా గిల్ ఆడినంతసేపు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా అటాకింగ్ కి దిగలేదు. నాకౌట్ మ్యాచ్ లో గిల్ శతకంతో మెరుస్తాడు అని అంతా భావించారు. గిల్ తల్లిదండ్రులు కూడా సంతోషంగా గిల్ బ్యాటింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 65 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేశాడు. అలాంటి తరుణంలో ఒక్కసారిగా గిల్ క్రీజును వదిలి పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ చేసేందుకు శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీ స్ట్రైక్ లో ఉండగా సింగిల్ తీశాడు. కాస్త ఇబ్బందిగానే గిల్ రన్ చేశాడు.

ఆ తర్వాత వెంటనే మోకాళ్లపై కూర్చుని ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఫిజియో వచ్చి గిల్ ని పరీక్షించిన తర్వాత అతడు క్రీజును వదిలి వెళ్లిపోయాడు. తొడ కండరాలు పట్టుకుపోవడం వల్లే గిల్ రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగినట్లు వెల్లడించారు. నడుస్తూ వెళ్లే సమయంలో కూడా గిల్ కాస్త కుంటుతూ కనిపించాడు. అయితే ఇలాంటి ఒక కీలక మ్యాచ్ లో ఆ క్రాంప్స్ నుంచి ఉపశమనం పొంది.. గిల్ మళ్లీ వచ్చి బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తన శతకంతో విజృంభించాలని ఆకాంక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలే గిల్ డెంగీ భారిన పడిన విషయం తెలిసిందే. ఎంత కోలుకున్నా కూడా ఆ ప్రభావం గిల్ పై కచ్చితంగా ఉంటుంది. నిజానికి మంచి ఫామ్ ని కొనసాగిస్తున్న గిల్ ఇంకాసేపు క్రీజులో ఉంటే బాగుండేది. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. 29 ఓవర్లకు టీమిండియా ఒక వికెట్ నష్టానికి 203 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(57*), శ్రేయాస్ అయ్యర్(16) బ్యాటింగ్ చేస్తున్నారు. కివీస్ బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. మరి.. శుభ్ మన్ గిల్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)