Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ! ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలోనే..

ఇప్పటికే సౌరవ్ గంగూలీ, ధోని రికార్డులను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. మరో అరుదైన ఫీట్ ను సాధించాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్ గా నిలిచాడు హిట్ మ్యాన్.

ఇప్పటికే సౌరవ్ గంగూలీ, ధోని రికార్డులను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. మరో అరుదైన ఫీట్ ను సాధించాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్ గా నిలిచాడు హిట్ మ్యాన్.

తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. గత కొంత కాలంగా పూర్ ఫామ్ తో ఇబ్బందులు పడుతూ.. జట్టుకు భారంగా మారాడని చాలా మంది విమర్శలు గుప్పించారు. అయితే ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో తానేంటో నిరూపించుకున్నాడు ఈ స్టార్ బ్యాటర్. ఇంగ్లాండ్ తో ప్రారంభమైన మూడో టెస్ట్ లో తొలిరోజే శతకంతో చెలరేగాడు. 33 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇప్పటికే సౌరవ్ గంగూలీ, ధోని రికార్డులను బ్రేక్ చేయగా.. మరో అరుదైన ఫీట్ ను సాధించాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్ గా నిలిచాడు రోహిత్.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. కీలకమైన మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చి.. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. టాపార్డర్ విఫలమైన వేళ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ లతో సెంచరీ చేసి సత్తాచాటాడు. అతడికి తోడు గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం అద్భుతంగా రాణించాడు. అర్దశతకం సాధించిన అతడు శతకం వైపు దూసుకెళ్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలుకొట్టాడు టీమిండియా కెప్టెన్. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సిక్సులు బాదిన ఇండియన్ తొలి కెప్టెన్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో 3 సిక్సులు బాదడం ద్వారా ఈ ఘనతకెక్కాడు. రోహిత్ మెుత్తం 121 ఇన్నింగ్స్ ల్లో 212 సిక్సులు బాదాడు.

కాగా.. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరిట ఉండేది. అతడు 330 ఇన్నింగ్స్ ల్లో 211 సిక్సులు కొట్టాడు. ఓవరాల్ గా అత్యధిక సిక్సులు బాదిన సారథుల జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 180 మ్యాచ్ ల్లో 233 సిక్సులు కొట్టాడు. ఇక ఈ లిస్ట్ లో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ 171 సిక్సులు, బ్రెండన్ మెక్ కల్లమ్ 170, విరాట్ కోహ్లీ 138 సిక్సులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్ల నష్టానికి 72 ఓవర్లలో 261 పరుగులు చేసింది. క్రీజ్ లో రవీంద్ర జడేజా(90), డెబ్యూ స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(16) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 131 పరుగులు చేసిన రోహిత్.. మార్క్ వుడ్ బౌలింగ్ లో స్టోక్స్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరి ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక సిక్సులు బాదిన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: పాక్​తో తండ్రి యుద్ధం.. ఇంగ్లండ్​పై కొడుకు అరంగేట్రం! ఇదో ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Show comments