Somesekhar
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన ఘనతను నెలకొల్పాడు. ఏకంగా భారత దిగ్గజ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన ఘనతను నెలకొల్పాడు. ఏకంగా భారత దిగ్గజ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును బ్రేక్ చేశాడు.
Somesekhar
ఐదు టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. సీనియర్ బౌలర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటుగా అక్షర్ పటేల్ సైతం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిర్ స్టోను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఆల్ రౌండర్. ఏకంగా టీమిండియా దిగ్గజ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డునే బ్రేక్ చేశాడు జడ్డూ భాయ్.
రవీంద్ర జడేజా.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఇటు బాల్ తో అటు బ్యాట్ తో రాణిస్తున్నాడు. బ్యాటింగ్ లో 87 పరుగులు చేసిన జడ్డూ.. బౌలింగ్ లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు స్టార్ ఆల్ రౌండర్. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన 6వ ఇండియన్ బౌలర్ గా చరిత్రకెక్కాడు. తాజాగా జరుగుతున్న టెస్ట్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోను పెవిలియన్ కు చేర్చడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు జడేజా. ఇప్పటి వరకు జడ్డూ మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్ లు ఆడి, 552 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత మాజీ దిగ్గజ పేసర్ జవగళ్ శ్రీనాథ్ ను అధిగమించాడు. ఈ లెజెండరీ బౌలర్ తన ఇంటర్నేషనల్ కెరీర్ లో 551 వికెట్లు పడగొట్టగా.. తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేశాడు జడ్డూ భాయ్.
ఇక ఈ లిస్ట్ లో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 953 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ 723 వికెట్లతో రెండో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఆటముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది ఇంగ్లాండ్. నాలుగో రోజు ఆట ప్రారంభించిన పర్యటక జట్టు మరో వికెట్ ను కోల్పోయింది. 28 పరుగులు చేసిన రెహన్ అహ్మద్ ను బుమ్రా పెవిలియన్ కు చేర్చాడు. మరోవైపు ఓలీ పోప్ మాత్రం డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. మరి దిగ్గజ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును బ్రేక్ చేసిన జడేజాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.