Rishabh Pant: బంగ్లాదేశ్ ఫీల్డ్ ను సెట్ చేయడంపై స్పందించిన పంత్! ఏమన్నాడంటే?

Rishabh Pant explains why Bangladesh field set: బంగ్లా ఫీల్డ్ ను సెట్ చేసి అందరిని నవ్వించాడు రిషబ్ పంత్. అయితే తాను ప్రత్యర్థి ఫీల్డింగ్ ను ఎందుకు సెటప్ చేశాడో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. కారణం చెప్పుకొచ్చాడు.

Rishabh Pant explains why Bangladesh field set: బంగ్లా ఫీల్డ్ ను సెట్ చేసి అందరిని నవ్వించాడు రిషబ్ పంత్. అయితే తాను ప్రత్యర్థి ఫీల్డింగ్ ను ఎందుకు సెటప్ చేశాడో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. కారణం చెప్పుకొచ్చాడు.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా బోణీ కొట్టింది. చెన్నై వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి.. ప్రత్యర్థిపై 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో చెలరేగిన భారత జట్టు సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, శుబ్ మన్ గిల్ సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో బంగ్లా ఫీల్డ్ ను సెట్ చేసి అందరిని నవ్వించాడు రిషబ్ పంత్. అయితే తాను ప్రత్యర్థి ఫీల్డింగ్ ను ఎందుకు సెటప్ చేశాడో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. కారణం చెప్పుకొచ్చాడు.

రిషబ్ పంత్.. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత బంగ్లాదేశ్ తో ఆడిన తొలి టెస్ట్ లోనే సెంచరీతో కదం తొక్కాడు. దాంతో సంప్రదాయ ఫార్మాట్ లో తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో 109 పరుగులు చేశాడు. కాగా.. తన బ్యాటింగ్ సందర్భంగా బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ను సెట్ చేసి అందర్నీ నవ్వించాడు పంత్. ఇద్దరు ఒకే దగ్గర ఫీల్డ్ చేస్తున్నారు.. ఒకరు అక్కడికి వెళ్లండి అని పంత్ సలహా ఇచ్చాడు. ఇక బంగ్లా కెప్టెన్ షాంటో సైతం పంత్ సలహాని పాటిస్తూ.. ఓ ఫీల్డర్ ను అక్కడికి పంపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా కూడా మారింది. అయితే.. తాను అలా బంగ్లా ఫీల్డ్ ను ఎందుకు సెట్ చేశాడో మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.

“క్వాలిటీ ఆఫ్ క్రికెట్ కోసమే నేను బంగ్లాదేశ్ ఫీల్డ్ ను సెట్ చేశాను. ఆఫ్ ద ఫీల్డ్ లో అజయ్ జడేజాతో నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఈ క్రమంలో ఆయన నాకు ఒక్కటే మాట చెబుతూ ఉంటాడు. ఎక్కడ ఆడినా.. ఎవరితో ఆడినా.. క్వాలిటీ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలనే వాడు. అందుకే నేను బ్యాటింగ్ చేసేటప్పుడు మిడ్ వికెట్ లో ఫీల్డర్ లేడు. ఒకే ప్లేస్ లో ఇద్దరు ఫీల్డర్లు ఉన్నారు. అందుకే ఒకరిని అక్కడికి వెళ్లమని చెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు పంత్. ఇక తన రీ ఎంట్రీ గురించి కూడా ఈ సందర్బంగా మాట్లాడాడు. చెన్నైలో ఆడటం తనకెంతో ఇష్టమని, ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకమైందని పంత్ తెలిపాడు. కారు ప్రమాదం తర్వాత మూడు ఫార్మాట్స్ ల్లో ఆడటంపై దృష్టి పెట్టానని పేర్కొన్నాడు.

Show comments