iDreamPost
android-app
ios-app

రేపే బంగ్లాతో చివరి టీ20.. అది కూడా హైదరాబాద్‌లో! ప్లేయింగ్‌ 11 ఇదే?

  • Published Oct 11, 2024 | 5:36 PM Updated Updated Oct 11, 2024 | 5:36 PM

IND vs BAN, Playing 11, Cricket News: బంగ్లాదేశ్‌తో శనివారం జరగబోయే చివరి టీ20 మ్యాచ్‌కు ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుంది.. పిచ్‌ ఎలా ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs BAN, Playing 11, Cricket News: బంగ్లాదేశ్‌తో శనివారం జరగబోయే చివరి టీ20 మ్యాచ్‌కు ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుంది.. పిచ్‌ ఎలా ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Oct 11, 2024 | 5:36 PMUpdated Oct 11, 2024 | 5:36 PM
రేపే బంగ్లాతో చివరి టీ20.. అది కూడా హైదరాబాద్‌లో! ప్లేయింగ్‌ 11 ఇదే?

ఇప్పటికే 2-0తో సిరీస్‌ మన వశమైంది. ఇక శనివారం హైదరబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగే చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. 3-0తో సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ అండ్‌ కో దీనిపైనే దృష్టిపెట్టారు. మరోవైపు బంగ్లాదేశ్‌ మాత్రం.. కనీసం చివరి మ్యాచ్‌ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. సో.. హైదరాబాద్‌లో జరిగే మూడో టీ20 మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఇప్పటికే రెండు మ్యాచ్‌లో గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా మూడో మ్యాచ్‌ కోసం ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగబోతుందో అనే ఆసక్తి క్రికెట్‌ అభిమానుల్లో ఉంది. విన్నింగ్‌ టీమ్‌ను కంటిన్యూ చేస్తారా? లేక తొలి రెండు మ్యాచ్ల్‌లో బెచ్‌కే పరిమితమైన ప్లేయర్లకు అవకాశం కల్పిస్తారా? అనేది చూడాలి.

ఎలాగో సిరీస్‌ మనదే అయింది కాబట్టి.. కొత్త ప్లేయర్లకు ఛాన్స్‌ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం రాని హర్షిత్‌ రాణాను మూడో వన్డేలో ఆడిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మన తెలుగుకు కుర్రాడు తిలక్‌ వర్మకు కూడా మూడో టీ20లో ఆడే ఛాన్స్‌ రావొచ్చు. వరుణ్‌ చక్రవర్తికి రెస్ట్‌ ఇచ్చి.. రవి బిష్ణోయ్‌కి ఒక మ్యాచ్‌లో అవకాశం ఇస్తారేమో చూడాలి. మొత్తానికి చివరిదైన మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతోనే బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ సైతం.. బెంచ్‌ స్ట్రెంత్‌ను టెస్ట్‌ చేయాలనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వరుణ్‌ చక్రవర్తి, అర్షదీప్‌ సింగ్‌, రియాన్‌ పరాగ్‌లకు రెస్ట్‌ ఇచ్చి.. రవి బిష్ణోయ్‌, హర్షిత్‌ రాణా, తిలక్‌ వర్మలకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఛాన్స్‌ ఇవ్వొచ్చు. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ పిచ్‌పై భారీ స్కోర్‌ నమోదు కావొచ్చు. టాస్‌ గెలిచిన టీమ్‌.. మోస్ట్‌లీ ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి బంగ్లాదేశ్‌తో శనివారం జరగబోయే మూడో టీ20కి టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌తో బరిలోకి దిగబోతుందో ఇప్పుడు చూద్దాం.. సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, నితీష్‌ కుమార్‌ రెడ్డి, హార్ధిక్‌ పాండ్యా, రియాన్‌ పరాగ్‌, రవి బిష్ణోయ్‌, హర్షిత్‌ రాణా, మయాంక్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌(అంచనా). మరి ఈ ప్లేయింగ్‌ ఎలెవన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.