iDreamPost
android-app
ios-app

ఆసీస్ తో మ్యాచ్ కి ముందు సూర్యకు ఘోర అవమానం!

  • Author Soma Sekhar Updated - 04:11 PM, Thu - 23 November 23

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఘోర అవమానం జరిగింది.

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఘోర అవమానం జరిగింది.

  • Author Soma Sekhar Updated - 04:11 PM, Thu - 23 November 23
ఆసీస్ తో మ్యాచ్ కి ముందు సూర్యకు ఘోర అవమానం!

వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియాకు, రన్నరప్ ఇండియాకు మధ్య మరో కీలక పోరు జరగనుంది. 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు దేశాలు తలపడనున్నాయి. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. ఇక ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు యువ టీమిండియా ఉర్రూతలూగుతోంది. యంగ్ ప్లేయర్లతో బరిలోకి దిగుతున్న భారత జట్టు ఏ మేరకు రాణిస్తుందో వేచిచూడాలి. ఇదిలా ఉండగా.. తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఘోర అవమానం జరిగింది.

సూర్యకుమార్ యాదవ్.. ఆసీస్ తో జరిగే 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కెప్టెన్ గా ఈ సిరీస్ ఎలాగైనా గెలిచి.. వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా. యువ ప్లేయర్లతో ఈ సిరీస్ లో బరిలోకి దిగబోతోంది భారత్. సూర్యకుమార్, రుతురాజ్, ఇషాన్ కిషన్, జైస్వాల్, రింకూ సింగ్ లాంటి యంగ్ ప్లేయర్లతో భారత జట్టు భీకరంగా కనిపిస్తోంది. ఇక ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తోంది. అయితే మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఘోర అవమానం జరిగింది. అసలు విషయం ఏంటంటే?

సాధారణంగా మ్యాచ్ కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయమని మనకు తెలిసిందే. అందులో భాగంగానే సూర్య కుమార్ కూడా మ్యాచ్ కు మందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. అయితే ఈ మీటింగ్ కు కేవలం ఇద్దరంటే ఇద్దరే జర్నలిస్టులు అటెండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఇది టీమిండియా కెప్టెన్ అయిన సూర్యకు జరిగిన ఘోర అవమానమే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే చాలా మంది జర్నలిస్టులు వస్తారు. కానీ ఈ మ్యాచ్ కు ముందు మాత్రం ఇద్దరే జర్నలిస్టులు అటెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.