Somesekhar
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. అయితే 32 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ స్పెషల్ మార్పుతో ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ జరగబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. అయితే 32 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ స్పెషల్ మార్పుతో ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ జరగబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టెస్ట్ క్రికెట్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ గా ఎంతో గుర్తింపు పొందింది. యాషెస్ తర్వాత మళ్లీ అంతటి గుర్తింపును దక్కించుకుంది భారత్-ఆసీస్ మధ్య జరిగే ఈ సిరీస్. ఈ ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ప్రతీ సంవత్సరం జరిగే సిరీస్ లా ఈ ఏడాది జరగడం లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓ మార్పు చోటుచేసుకుంది. 32 ఏళ్లలో తొలిసారి ఇలా నిర్వహించబోతున్నారు. ఇంతకీ ఆ మార్పు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ లో ఈసారి నాలుగు టెస్టులు కాదు.. ఐదు టెస్టులు ఆడబోతోంది. ప్రతీ ఏడాది 4 టెస్టుల మ్యాచ్ సిరీస్ మాత్రమే ఆడేవారు. కానీ ఈసారి 5 మ్యాచ్ లు జరగబోతున్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటన చేసింది. ఇలా ఇరు జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనుండటం 32 ఏళ్లలో ఇదే తొలిసారి.
1991-92 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగుతూ వస్తోంది. ఆడిలైడ్ లో తొలి టెస్ట్ ను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఈసారి పేస్ కు అనుకూలించే పెర్త్ వేదికగా ఈ పోరు ప్రారంభం కానుండటం గమనార్హం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? ఆడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్ట్ డే అండ్ నైట్ కాగా.. గతంలో 2020లో ఇదే వేదికపై డే అండ్ నైట్ మ్యాచ్ ఆడిన టీమిండియా 36 రన్స్ కే ఆలౌట్ కావడం గమనార్హం. ఆ మ్యాచ్ లో భారత్ 8 వికెట్లతో ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు సేమ్ పిచ్ రిపీట్ అవుతుండటంతో కొసమెరుపు.
BORDER GAVASKAR TROPHY SCHEDULE:
1st Test – 22nd to 26th Nov, Perth.
2nd Test – 6th to 10th Dec, Adelaide (D/N).
3rd Test – 14th to 18th Dec, Gabba.
4th Test – 26th to 30th Dec, MCG.
5th Test – 3rd to 7th Jan, Sydney. pic.twitter.com/nKsPDsQLmE— Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2024
ఇదికూడా చదవండి: Virat Kohli: పంజాబ్ పై విజయం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ క్యూట్ వీడియో!