రెండు మ్యాచ్ ల్లో ఘోర పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా.. మూడో మ్యాచ్ లో మాత్రం దంచికొడుతోంది. టీమిండియా బౌలర్లపై తన ఆధిక్యాన్ని చూపిస్తూ.. భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ముఖ్యంగా ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఉన్న కొద్దిసేపైనా గ్రౌండ్ లో అలజడి సృష్టించాడు. విధ్వంసకర హాఫ్ సెంచరీతో జట్టుకు గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్ లో కేవలం 32 బంతుల్లోనే అర్దశతకం బాది ఔరా అనిపించాడు.
టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెచ్చిపోయాడు. భారత బౌలర్లపై యుద్ధాన్ని ప్రకటిస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు బౌలర్లను అల్లాడించాడు. చాలా రోజుల తర్వాత తన మునుపటి ఫామ్ ను అందుకున్నాడు వార్నర్ భాయ్. ఈ మ్యాచ్ లో కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్ కు చేరాడు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్ లో అనవసరపు షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 78 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
కాగా.. కేవలం 8.1 ఓవర్లలో 78 పరుగులు చేస్తే.. అందులో వార్నర్ వే 56 రన్స్ కావడం విశేషం. దీన్ని బట్టే అర్దం అవుతుంది వార్నర్ ఏ రేంజ్ లో టీమిండియా బౌలర్లను దంచికొట్టాడో. వార్నర్ వికెట్ పడిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతానికి 21 ఓవర్లలో ఆసీస్ స్కోర్ 148 పరుగులుగా నమోదైంది. క్రీజ్ లో మిచెల్ మార్ష్(54), స్మిత్(37) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరు ఇలాగే రాణిస్తే.. ఆసీస్ భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Fifty by David Warner in just 32 balls!!
The vintage Warner is back ahead of the World Cup – 3rd consecutive fifty by Warner in this series. pic.twitter.com/NF9eE0LAAN
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023