iDreamPost
android-app
ios-app

David Warner: చివరి టెస్టుకి ముందు వార్నర్ ఎమోషనల్.. ఇందుకే నువ్వు మాకు నచ్చేది!

  • Published Jan 03, 2024 | 1:55 PM Updated Updated Jan 03, 2024 | 1:55 PM

తన కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ ఎమోషనల్ అయ్యాడు. అతడు చేసిన పనికి అందరు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ వార్నర్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.

తన కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ ఎమోషనల్ అయ్యాడు. అతడు చేసిన పనికి అందరు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ వార్నర్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.

David Warner: చివరి టెస్టుకి ముందు వార్నర్ ఎమోషనల్.. ఇందుకే నువ్వు మాకు నచ్చేది!

డేవిడ్ వార్నర్.. తన టెస్ట్ కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్నాడు. పాకిస్తాన్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ అతడికి ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ లో తొలి రోజు చివరి ఓవర్ లో బ్యాటింగ్ కు దిగాడు డేవిడ్ వార్నర్. సాధారణంగానే ఏ క్రికెటర్ అయినా.. వీడ్కోలు పలుకుతుంటే కొంత ఎమోషనల్ అవుతాడు. వార్నర్ సైతం గ్రౌండ్ లోకి దిగుతూ.. చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇది చూసిన క్రికెట్ లవర్స్ ఇందుకే డేవిడ్ భాయ్ నువ్వు మాకు నచ్చేది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇంతకీ వార్నర్ చేసిన పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డేవిడ్ వార్నర్.. సమకాలీన ప్రపంచ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్. తొలి ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లపై దూకుడు ప్రదర్శించి.. వారిని ఒత్తిడికి గురిచేస్తుంటాడు. దిగ్గజ క్రికెటర్లు సైతం వార్నర్ ను వరల్డ్ క్రికెట్ లోనే విధ్వంసకర ఓపెనర్ గా కీర్తించడం మనందరికి తెలిసిందే. ఇక వార్నర్ తన టెస్ట్ కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్నాడు. పాకిస్తాన్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో వార్నర్ చివరి రోజు చివరి ఓవర్లో బ్యాటింగ్ కు దిగాడు. ఇక ఆఖరి మ్యాచ్ కావడంతో.. పాకిస్తాన్ ఆటగాళ్లు వార్నర్ కు ఘనంగా హానర్ ఇచ్చారు. కాగా.. డేవిడ్ భాయ్ బ్యాటింగ్ కు దిగే ముందు చేసిన ఓ పనికి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. గ్రౌండ్ లోకి అడుగుపెట్టే ముందు.. ఆస్ట్రేలియా దివంగత బ్యాటర్ ఫిలిఫ్ హ్యూస్ శిలాఫలకాన్ని తాకి, ఎమోషనల్ గా బ్యాటింగ్ కు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో.. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

david warner emotional

నవంబర్ 27న షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌కి ఫిలిప్ హ్యూస్ గాయపడ్డాడు. బంతి అతని తలకు తగలడంతో గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. ఆ ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత హ్యూస్ మరణించాడు. ఈ వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడిని గుర్తు చేసుకుంటూ.. వార్నర్ అతడి శిలా ఫలకాన్ని తాకి గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఇందుకే వార్నర్ భాయ్ నువ్వు మాకు నచ్చేది.. అంటూ పొడగ్తలు కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిరోజు ఆటముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్ లో 313 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మరోసారి 5 వికెట్లతో చెలరేగాడు. డేవిడ్ వార్నర్ (6), ఉస్మాన్ ఖవాజా(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి ఫిలిప్ హ్యూస్ ను తలచుకుని ఎమోషనల్ అయిన వార్నర్ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.