SNP
Kapil Dev, IND VS ENG, 1990 Lord's Test: టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్, 1983లో ఇండియాను ఛాంపియన్‌గా నిలిపి.. మొట్టమొదటి వరల్డ్‌కప్ అందించిన హీరో.. కపిల్ దేవ్ సరిగ్గా 34 ఏళ్ల క్రితం లార్డ్స్ మైదానంలో సృష్టించిన విధ్వంసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Kapil Dev, IND VS ENG, 1990 Lord's Test: టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్, 1983లో ఇండియాను ఛాంపియన్‌గా నిలిపి.. మొట్టమొదటి వరల్డ్‌కప్ అందించిన హీరో.. కపిల్ దేవ్ సరిగ్గా 34 ఏళ్ల క్రితం లార్డ్స్ మైదానంలో సృష్టించిన విధ్వంసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
కపిల్ దేవ్.. భారత క్రికెట్ అభిమానులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే టీమిండియా తరఫున ఆడి.. కెప్టెన్‌గా జట్టును నడిపించి.. భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపి.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వ్యక్తి గురించి.. ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గుర్తుపెట్టుకున్నారంటే.. భారత క్రికెట్‌పై అతను వేసిన ముద్ర అలాంటిది. 1983లో భారత్ మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన మాత్రమే కాదు.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్. అందుకే కపిల్ దేవ్ అంటే ఒకప్పుడు ఫేస్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్. తన కెరీర్‌లో ఎన్నో ఘనతలు సృష్టించిన కపిల్ దేవ్.. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్‌లో సృష్టించిన విధ్వంస గురించి ఇవాళ తెలుసుకుందాం.. ఎందుకంటే.. ఆ విధ్వంసానికి నేటితో 34 ఏళ్లు పూర్తి అయ్యాయి.
1990లో మొహమ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించింది. జులై 26న లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 653 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ గ్రాహం గూచ్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. 333 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అలాగే లెన్ లంబ్ 139, రాబిన్ స్మిత్ 100 సెంచరీలతో కదం తొక్కారు. 653 రన్స్ చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అప్పటి ఓపెనర్ రవిశాస్త్రి, కెప్టెన అజహరుద్దీన్ సెంచరీలతో రాణించారు.
కానీ, టాపార్డర్, ఇంకా మిడిల్డార్‌లో మిగతా బ్యాటర్లు.. సిద్ధు, సంజయ్ మంజ్రేకర్, సచిన్ టెండూల్కర్ విఫలం కావడంతో.. టీమిండియాకు ఫాలో ఆన్ గండం వెంటాడింది. దిలిప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్ హాఫ్ సెంచరీలతో పర్వాలేదనిపించారు. అయితే.. చివర్లో టీమిండియా ఫాలో అన్ గండం నుంచి తప్పించుకోవాలంటే.. 24 పరుగులు చేయాలి.. కానీ, చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. క్రీజ్‌లో కపిల్ దేవ్‌తో పాటు నరేంద్ర హిర్వాణి ఉన్నారు. టెయిలెండర్ అయిన హిర్వాణికు స్టైక్ ఇవ్వలేడు కపిల్ దేవ్. ఎందుకంటే.. అతను అవుట్ అయితే.. ఇండియా ఫాల్ ఆన్ ఆడాల్సి ఉంటుంది. ఇక్కడే కపిల్ దేవ్‌లోని రాక్షసుడు బయటికి వచ్చాడు.. ఫాలో ఆన్ తప్పించుకునేందుకు.. నాలుగు వరుస బంతులో నాలుగు భారీ సిక్సులు బాది సంచలనం నమోదు చేశాడు.
కపిల్ దేవ్ సృష్టించిన ఆ విధ్వంసంతో లార్డ్స్ స్టేడియం దద్దరిల్లిపోయింది. లార్డ్స్ బాల్కనీలో టీమిండియా ఆటగాళ్లు నిలబడి మరీ చప్పట్లు కొడుతూ.. కపిల్ దేవ్‌ను అభినందించారు. వరుసగా నాలుగు భారీ సిక్సులతో కపిల్ దేవ్.. టీమిండియా ఫాలో ఆన్ ఆడకుండా చేసి దేశం పరువు కాపాడాడు. 75 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు కపిల్. మొత్తంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 454 పరుగులు చేసింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 272 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కానీ, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే కుప్పకూలడంతో 247 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలైంది. మ్యాచ్ ఓడినా.. కపిల్ దేశ్ కొట్టిన ఆ నాలుగు సిక్సులతు ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల హృదయాల్లో అలా నిలిచిపోయాయి. మరి కపిల్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Lord’s 1990 – India needed 24 to avoid the follow on, last wicket in hand, Kapil Dev to Hemmings:
6, 6, 6, 6. 🤯👊pic.twitter.com/UDBximdmXx
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 30, 2024