iDreamPost

Imran Tahir: చరిత్ర సృష్టించిన ఇమ్రాన్ తాహిర్.. 44 ఏళ్ళ వయసులో ఏంటి సామీ ఇది!

సౌతాఫ్రికా మాజీ స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ టీ20 ప్రపంచ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. 44 ఏళ్ల వయసులో ఈ రికార్డు సాధించడంతో.. అందరూ షాకౌతున్నారు.

సౌతాఫ్రికా మాజీ స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ టీ20 ప్రపంచ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. 44 ఏళ్ల వయసులో ఈ రికార్డు సాధించడంతో.. అందరూ షాకౌతున్నారు.

Imran Tahir: చరిత్ర సృష్టించిన ఇమ్రాన్ తాహిర్.. 44 ఏళ్ళ వయసులో ఏంటి సామీ ఇది!

టీ20 ప్రపంచ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు సౌతాఫ్రికా మాజీ స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించిన తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(BPL)లో 2024లో రంగ్ పూర్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. ఇక ఈ టోర్నీలో తాజాగా ఖుల్నా టైగర్స్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన ఫీట్ ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. 44 ఏళ్ళ వయసులో ఈ ఘనత సాధించడం పట్ల నెటిజన్లు అవాక్కౌతున్నారు.

ఇమ్రాన్ తాహిర్.. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫ్రాంచైజీ లీగ్ ల్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో రంగ్ పూర్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఖుల్నాటైగర్స్ తో జరిగిన మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఇమ్రాన్ తాహిర్. ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీయడంతో.. టీ20 క్రికెట్ లో 500 వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా నిలిచాడు.

కాగా.. 44 ఏళ్ళ వయసులో ఈ ఫీట్ ను సాధించడంతో.. క్రికెట్ అభిమానులు షాకౌతున్నారు. ఈ లిస్ట్ లో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్, మాజీ ప్లేయర్ డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 ఫార్మాట్ లో 571 మ్యాచ్ లు ఆడిన బ్రావో.. 624 వికెట్లు తీశాడు. ఇక ఈ జాబితాలో 556 వికెట్లతో ఆఫ్గాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో ప్లేస్ లో ఉండగా.. విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ 532 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో లెగ్ స్పిన్నర్ గా తాహిర్ మరో రికార్డు నెలకొల్పాడు. మరి 44 ఏళ్ల వయసులో ఈ అరుదైన ఫీట్ సాధించిన తాహిర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌ 11 ఇదే! డేంజర్‌ ప్లేయర్‌ ఇన్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి