iDreamPost

IPL 2024: రాసిపెట్టుకోండి.. SRHదే టైటిల్! 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ సెంటిమెంటే ప్రూఫ్!

రాసిపెట్టుకోండి.. ఈసారి ఐపీఎల్ 2024 కప్ కొట్టబోయేది సన్ రైజర్స్ హైదరాబాదే అంటున్నారు ఫ్యాన్స్. దానికి 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ సెంటిమెంట్ ను ప్రూఫ్ గా కూడా చూపిస్తున్నారు. ఆ ప్రూఫ్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

రాసిపెట్టుకోండి.. ఈసారి ఐపీఎల్ 2024 కప్ కొట్టబోయేది సన్ రైజర్స్ హైదరాబాదే అంటున్నారు ఫ్యాన్స్. దానికి 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ సెంటిమెంట్ ను ప్రూఫ్ గా కూడా చూపిస్తున్నారు. ఆ ప్రూఫ్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

IPL 2024: రాసిపెట్టుకోండి.. SRHదే టైటిల్! 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ సెంటిమెంటే ప్రూఫ్!

IPL 2024 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. కేకేఆర్, సన్ రైజర్స్, రాజస్తాన్, ఆర్సీబీ కప్ కోసం పోటీపడబోతున్నాయి. దాంతో ఈ నాలుగు జట్లలో ఏది ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సీజన్ ప్రారంభం నుంచే కొన్ని సెంటిమెంట్స్ రిపీట్ కావడంతో.. ఆ సెంటిమెంట్ కారణంగా కచ్చితంగా ఆ టీమే కప్పుకొడుతుంది అంటూ ప్రూఫ్స్ తో సహా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సెంటిమెంట్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సార్లు రిపీట్ అయిన సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే.. ఈసారి ఐపీఎల్ టైటిల్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎగరేసుకుపోతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో భాగంగా క్వాలిఫయర్ 1లో కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్ తలపడబోతున్నాయి. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్తాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ సెంటిమెంట్ క్రీడావర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ సెంటిమెంట్ రిపీట్ ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ ను కొట్టేది సన్ రైజర్స్ హైదరాబాద్ అని, ఇది రాసిపెట్టుకోండి అంటూ ఫ్యాన్స్ బల్లాగుద్దిమరీ చెబుతున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే?

2008 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ టోర్నీల్లో పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్ లో ఉన్న టీమ్ అత్యధికంగా 7సార్లు కప్ప ను ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత తొలి ప్లేస్ లో ఉన్న జట్టు ఆరుసార్లు, 3వ ప్లేస్ లో ఉన్న టీమ్ రెండుసార్లు, నాలుగో స్థానంలో ఉన్న టీమ్ కేవలం ఒక్కసారి మాత్రమే కప్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సీజన్ లో SRH సెకండ్ ప్లేస్ లో ఉన్నందున్న ఐపీఎల్ 2024 ట్రోఫీ హైదరాబాద్ దక్కించుకుంటుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి