లంకతో వన్డే సిరీస్‌లో సూర్య ఉంటే.. టీమిండియాకి ఈ పరిస్థితి వచ్చేది కాదు!

IND vs SL, Spin Bowling, Suryakumar Yadav: శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియాలో ఆ ప్లేయర్‌ ఉండి ఉంటే.. ఇంత దారుణ ఓటములు ఎదురయ్యేవి కాదని, జట్టు పరిస్థితి మెరుగ్గా ఉండేదని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

IND vs SL, Spin Bowling, Suryakumar Yadav: శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియాలో ఆ ప్లేయర్‌ ఉండి ఉంటే.. ఇంత దారుణ ఓటములు ఎదురయ్యేవి కాదని, జట్టు పరిస్థితి మెరుగ్గా ఉండేదని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 0-2 తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. గెలవాల్సిన తొలి వన్డేను చెత్త బ్యాటింగ్‌తో టై చేసుకున్న భారత జట్టు.. తర్వాతి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఓటమి అదేనే లేకుండా.. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. అలాంటి జట్టు.. పసికూన లాంటి శ్రీలంక చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోవడంతో టీమిండియా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే.. వన్డే సిరీస్‌కు సెలెక్ట్‌ చేసిన భారత జట్టులో ఆ ఒక్క ప్లేయర్‌ అంటే టీమిండియాకు ఈ పరిస్థితి ఉండేది కాదని.. కొంతమంది క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఈ వన్డే సిరీస్‌కి ముందు భారత జట్టు లంకతో మూడు టీ20ల సిరీస్‌ను పల్లెకలె వేదికగా ఆడిన విషయం తెలిసిందే. కొత్త టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు యంగ్‌ క్రికెటర్లు శ్రీలంకను 3-0తో క్వీన్ స్వీప్‌ చేశారు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా సూర్య మంచి ప్రదర్శన కనబర్చాడు. అదే సూర్యకుమార్‌ యాదవ్‌ను వన్డే సిరీస్‌కి కూడా తీస్కొని ఉంటే.. లంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్‌ పటిష్టంగా ఉండేది. ఎందుకంటే.. సూర్యకుమార్‌ యాదవ్‌ స్పిన్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్లను అద్భుతంగా ఆడగలడు. అదే అతని ప్రధాన బలం. బాల్‌ టర్న్‌ అవుతున్న సమయంలో ఆ స్పిన్‌ను కట్‌ చేయాలన్నా, స్పిన్‌ బౌలింగ్‌ను ట్యాకిల్‌ చేయాలన్నా.. స్వీప్‌ షాట్లతోనే అవుతుంది.

వన్డే సిరీస్‌ ఆడిన బ్యాటర్లలో ఒక్క రోహిత్‌ శర్మ తప్ప వేరే ఏ బ్యాటర్‌ కూడా సరిగ్గా స్వీప్‌ షాట్ల ఆడలేరు. స్వీప్‌ షాట్లు ఆడలేకపోవడంతోనే శ్రీలంక స్పిన్‌ బౌలర్లను భారత బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయారు. అదే సూర్య కనుక టీమ్‌లో ఉండి ఉంటే.. కచ్చితంగా డిఫరెన్స్‌ ఉండేదని అంటున్నారు క్రికెట్‌ పండితులు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఆడిన భారత జట్టు భాగమైన సూర్య.. ఆ మెగా టోర్నీలో విఫలం అయ్యాడు. తాజాగా అతనికి టీ20 కెప్టెన్సీ ఇవ్వడంతో.. అతన్ని పూర్తిగా వన్డేలకు దూరం పెడుతున్నట్లు సెలెక్టర్లు ప్రకటించారు. కానీ, శ్రీలంకతో వన్డే సిరీస్‌ జరిగిన విధానం, పిచ్‌ వ్యవహరించిన తీరు, మన బ్యాటర్లు పడిన ఇబ్బందులు చూస్తే.. సూర్యకుమార్ యాదవ్‌ జట్టులో ఉంటే బాగుండేదని క్రికెట్‌ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments