iDreamPost

IND vs AUS: ఆసీస్ ను ఓడించినా.. టీమిండియాకు గండమే! సెమీస్ లో డేంజర్ టీమ్ తో ఢీ..

సూపర్ 8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ లో ఆ జట్టును ఓడించినా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా మన టీమ్ సెమీస్ వెళ్తుంది. కానీ సెమీస్ లో అసలైన గండం ఉంది. అదే ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ 8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ లో ఆ జట్టును ఓడించినా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా మన టీమ్ సెమీస్ వెళ్తుంది. కానీ సెమీస్ లో అసలైన గండం ఉంది. అదే ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

IND vs AUS: ఆసీస్ ను ఓడించినా.. టీమిండియాకు గండమే! సెమీస్ లో డేంజర్ టీమ్ తో ఢీ..

టీ20 వరల్డ్ కప్ లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా రెడీగా ఉంది. వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధిస్తూ.. జోరుమీదుంది భారత జట్టు. అదే జోరును కంగారూ టీమ్ పై చూపించాలని ఉవ్విళ్లూరుతోంది టీమిండియా. అయితే ఆసీస్ ను ఈ మ్యాచ్ లో ఓడించినా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా మన టీమ్ సెమీస్ వెళ్తుంది. కానీ సెమీస్ లో అసలైన గండం ఉంది. ఇప్పుడు ఈ న్యూసే ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. మరి సెమీస్ లో టీమిండియా ఢీ కొట్టే ఆ డేంజర్ టీమ్ ఏది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమికి రివేంజ్ తీర్చుకోవడానికి రోహిత్ సేన సన్నద్ధమైంది. సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా.. సెమీస్ కు దూసుకెళ్లాలని భావిస్తోంది టీమిండియా. ఇక ఆసీస్ కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో కంగారూ టీమ్ ఓడిపోతే.. ఇంటికి వెళ్లాల్సిందే. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆసీస్ పై గెలిచి సెమీస్ కు వెళ్లిన టీమిండియాకు అసలైన గండం ఇంగ్లండ్ రూపంలో ఉంది. ఇప్పటికే ఆ టీమ్ గ్రూప్ 2 నుంచి సెమీస్ కు చేరి కూర్చుంది.

india playing semis with danger team

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ లో సాధారణంగా ఆడుతూ వచ్చిన ఇంగ్లండ్.. సూపర్ 8లో మాత్రం చెలరేగి ఆడుతోంది. టార్గెట్ లను తక్కువ ఓవర్లలోనే దంచికొడుతూ.. ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ పంపిస్తోంది. ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్ లతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఇక ఆ జట్టు సూపర్ 8లో ఆడిన విధానం గమనిస్తే.. టీమిండియాకు కఠినపరిస్థితులు ఎదురు అవుతాయని చెప్పక తప్పదు. వెస్టిండీస్ పై 181 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలోనే దంచికొట్టింది.

తాజాగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో సైతం 116 స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా.. 9.4 ఓవర్లలోనే ఊదేసింది. పైగా నాకౌట్స్ లో ఇంగ్లండ్ మరింత డేంజర్ గా మారుతూ ఉంటుంది. ఈ విషయం చరిత్రను చూస్తే తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2022లో కూడా సెమీస్ లో ఇంగ్లండ్ నే ఢీకొట్టింది ఇండియా. కానీ ఆ మ్యాచ్ లో భారత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 16 ఓవర్లలోనే ఈడ్చికొట్టింది. ఆ మ్యాచ్ లో జోస్ బట్లర్(80*), అలెక్స్ హేల్స్(86*) పరుగులు చేశారు.

ఇక ఇప్పుడు కూడా ఆసీస్ పై గెలిచినా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా.. సెమీస్ లో ఇంగ్లండ్ ను ఢీకొనాలి టీమిండియా. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోతే మాత్రం సౌతాఫ్రికాను ఢీకొనాల్సి వస్తోంది. దాంతో ఆసీస్ పై టీమిండియా ఓడిపోతేనే బెటర్ అంటూ కొంత మంది ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ కు ఎలాంటి జట్టునైనా ఓడిస్తుందని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి